26.2 C
Hyderabad
January 15, 2025 17: 21 PM
Slider ప్రపంచం

చైనా దెబ్బకు దివాలా అంచున ప్రపంచ దేశాలు

చైనాకు చెందిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్ గ్రాండ్ దివాలా తీసింది. 305 బిలియన్ డాలర్ల అప్పుల్లో ఉన్న ఈ సంస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలుచేసేందుకు సిద్దంగా ఉంది. ఇళ్ల నిర్మాణానికి ఎవర్ గ్రాండ్ కు అడ్వాన్స్ లు చెల్లించిన ఎంతో మంది చైనీయులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఒకటీరెండు కాదు.. ఆ కంపెనీ దగ్గర 16 లక్షల మందికి చెందిన ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.

చైనాలో ఎవర్‌ గ్రాండ్ అనేది అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ. 1996లో హ్యూ కా యాన్ దీన్ని ఏర్పాటు చేశారు. లక్షా 23వేల 276మంది ఉద్యోగులున్నారు ఈ కంపెనీలో. ఒకప్పుడు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లిస్ట్ లో కూడా ఉన్న ఈ కంపెనీ మొత్తం 280 నగరాల్లో కార్యకలాపాలు విస్తరించింది. మొత్తం 1,300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టింది.

ఎవర్ గ్రాండ్ కు అప్పిచ్చిన సంస్థల్లో 128 కి పైగా బ్యాంకులు, 121 నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ 305 బిలియన్ డాలర్లు. చైనా సంస్థల్లో ఈ సంస్థ అతిపెద్ద రుణ గ్రహీత. 2020లో రియల్ సంస్థల రుణాలపై పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా నియంత్రణ చర్యలు చేపట్టింది.

ఈ నిబంధనల ప్రకారం ఒకసారి అప్పు తీసుకున్నా.. ఏడాది దాటితే చాలు, అవి చెల్లించకపోయినా మళ్లీ అప్పు చేసుకోవచ్చు. ఈ లూప్‌హోల్‌తో ఎవర్ గ్రాండ్ సంస్థ అప్పులు చేసుకుంటూ పోయింది. జూన్ 23న ఎవర్ గ్రాండ్ రేటింగ్ ను బి ప్లస్ నుంచి ‘బి’కి తగ్గించిన ఫిచ్ రేటింగ్ సంస్థ. దీంతో చైనా బ్యాంకులు అప్పులు చెల్లించాలని ఒత్తిడి మొదలుపెట్టాయి.

ప్రపంచంపై ఎవర్ గ్రాండ్ ప్రభావం చాలా గట్టిగానే ఉండే చాన్స్‌ కనిపిస్తోంది. దీని దెబ్బతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. చైనాలో అమెరికా పెట్టుబడులు, అమెరికాలో చైనా సంస్థల పెట్టుబడులు కూడా దారుణంగా పడిపోతున్నాయి. ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 9.42 ట్రిలియన్ల నుంచి రూ.8.85 ట్రిలియన్లకు తగ్గిపోయింది.

Related posts

ఏఓబీలో గిరిజనులతో మమేకమైన లేడీ ఎస్పీ…!

Satyam NEWS

పంజాబ్ కాంగ్రెస్ లో ఇంకా చల్లారని విభేదాలు

Satyam NEWS

రేపు గవర్నర్ తో భేటీ కానున్న సిఎం జగన్

Satyam NEWS

Leave a Comment