37.2 C
Hyderabad
March 28, 2024 18: 31 PM
Slider నెల్లూరు

నెల్లూరు వి యస్ యు లో ప్రపంచ ధరిత్రి దినోత్సవం

#nellore

జాతీయ సేవా పథకం ఆధ్వర్యం లో ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు విశ్వవిద్యాలయ ప్రాంగణం లో మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి అని అందుకే గౌరవంగా అందరు ధరిత్రి అని  పిలుచుకుంటారు అన్నారు.

మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనికి ఆధారం భూమి. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది అన్నారు.

మనకు కావలసిన అన్ని రకాల వనరులను మనము భూమి నుంచి తీసుకుంటున్నామని దానికి ప్రతిఫలంగా ధరిత్రి పరిరక్షణ కోసం మనము ప్రత్యేక చర్యలు చేపట్టకపోయిన పర్వాలేదు  కానీ హాని కలిగించే చర్యలు చేపట్టవద్దని కోరారు.

పెరుగుతోన్న భూతాపం, వాతావరణ కాలుష్యం, పర్యావరణ పరిరణక్ష విషయమై ప్రజల్లో అవగాహన పెంచి, అంతరించిపోతున్న జీవజాతులను కాపాడుకోవలసిన అవసరం మనఅందిరి మీద ఉందని తెలిపారు.

రెక్టార్ ఆచార్య యం.చంద్రయ్య, మాట్లాడుతూ పుడమి తల్లికి కోపమొస్తే ప్రళయమోస్తది ప్రకృతిని  ప్రేమించి చేట్లు పెంచితే ప్రాణమిస్తంది అన్నారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్.విజయ కృష్ణా రెడ్డి కార్య నిర్వాహకులు NSS సమన్వయ కర్త డా.ఉదయ్ శంకర్ అల్లం, డా.కిరణ్మయి, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది, ఎన్ యస్ యస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యం

Murali Krishna

మంజీర పై వంతెన పనులకు గ్రహణం వీడేనా

Satyam NEWS

పేద బ్రాహ్మణులకు ఉచితంగా బ్రాహ్మణ సదన్

Satyam NEWS

Leave a Comment