39.2 C
Hyderabad
April 23, 2024 17: 49 PM
Slider ముఖ్యంశాలు

వరల్డ్ గ్రేటెస్ట్ బ్రాండ్ అండ్ లీడర్ గా శిద్దా సుధీర్

#Sidda Sudheerkumar

ప్రఖ్యాత మీడియా సంస్థ ఏషియా వన్ మ్యాగ్జైన్, యు.ఆర్.ఎస్.మీడియా, గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్, డేల్లాయిట్ గ్రూప్స్ ప్రతిష్టాత్మక 2019౼2020 వరల్డ్ గ్రేటెస్ట్ బ్రాండ్ &  లీడర్స్  అవార్డ్ ఆరవ ఎడిషన్ కు జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంపిక అయింది.

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2 వేల సంస్థలు 10 కి పైగా దేశాల నుండి 16 రకాల పరిశ్రమలలో అధ్యయనం చేసి నాణ్యమైన ఎగుమతులు, పరిశ్రమ నిర్వహణ, దిగుమతులదారుల సంతృత్తి, ఉపాధి, విదేశీ మారక ద్రవ్యం, పర్యావరణ పరిరక్షణ, క్రమశిక్షణతో కూడిన లీడర్ షిప్ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డ్ కు ఎంపిక చేస్తారు.

తక్కువ కాలంలో ఎక్కువ ఫలితం

పరిశ్రమలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం,  విజనరీ, గొప్ప నాయకత్వ లక్షణం,హార్డ్ వర్క్, మక్కువతో పనిచేసి తక్కువ కాలంలో పరిశ్రమ అభివృద్ధి, తదితర అంశాలలో జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఇండియా మొదటి స్థానం సంపాదించుకున్నందున 2019- 2020 సంవత్సరానికి  ఈ అవార్డ్ కు జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్  శిద్దా సుధీర్ కుమార్ ను ఎంపిక చేశామని ఏషియా వన్ మ్యాగజైన్, యు.ఆర్.ఎస్ మీడియా ప్రతినిధులు తెలిపారు.

శిద్దా సుధీర్ కుమార్ నాయకత్వ లక్షణాలను, నిబద్ధతతో కూడిన వ్యాపార లక్షణాలను ఏషియా వన్ సంస్థ తమ సర్వే ద్వారా గుర్తించి, ఈ  అవార్డ్ ప్రకటించామని  ఏషియా వన్ సంస్థ సి.ఇ. ఓ,సందీప్ కుమార్ తెలిపారు. త్వరలో న్యూఢిల్లీ లో జరిగే ఏషియా వన్ అంతర్జాతీయ వేడుకల్లో శిద్దా సుధీర్ కుమార్ కు అవార్డ్ ఇవ్వనున్నట్లు సంస్థ సి.ఇ. ఓ సందీప్ కుమార్ తెలియ చేశారు.

గతంలో అవార్డుకు ఎంపికైన ప్రముఖులు

ఏషియా వన్ మీడియా సంస్థ తమ 5 వ ఎడిషన్ 2018౼2019 అవార్డ్స్ గతంలో  ఆధాని గ్రూప్స్, వేదాంత రిసోర్సెస్,మహేంద్ర గ్రూప్, డా.బాత్ర గ్రూప్,షాప్ క్లూస్.కామ్, పరిమళ గ్రూప్,ఐ. టి.ఎల్ గ్రూప్స్ దుబాయ్,అపోలో ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ లిమిటెడ్,ఓం లాజిస్టిక్స్,మై హోమ్,రామేశ్వరరావు, హైదరాబాద్, దోహా బ్యాంక్ గ్రూప్,కటరియా హోల్డింగ్స్, జి వి.కె గ్రూప్స్ మొదలగు సంస్థలకు ఈ అవార్డ్స్ ఇచ్చారు.

అవార్డ్స్ మీడియా పార్ట్నర్ గా ప్రఖ్యాత  సి.ఎన్. బి.సి.టీవీ 18 ఛానెల్ గా వ్యవరించారు. ఏషియా వన్ ప్రతిష్టాత్మక వరల్డ్ గ్రేటెస్టు బ్రాండ్ & లీడర్స్ అవార్డ్ శిద్దా సుధీర్ కుమార్ కి రావడంపట్ల  గ్రానైట్ పరిశ్రమలకు చెందిన పారిశ్రామికవేత్తలు, స్నేహితులు, వ్యాపార,వాణిజ్య రంగాలకు చెందిన పలువురు సుధీర్ కుమార్ ను అభినందించారు.

ఈ అవార్డుతో బాధ్యత పెరిగింది

ప్రతిష్టాత్మక అవార్డ్ మన రాష్ట్రంలో జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఇండియా కి రావడం ఎంతో గర్వకారణంగా ఉందని, ఈ అవార్డ్ తమకు ఒక బాధ్యతను పెంచిందని, అవార్డ్ ప్రకటించిన ఏషియా వన్ మీడియా సంస్థలకు,యు.ఆర్. ఎస్,మీడియా,గల్ఫ్ ఆపరేషన్ కౌన్సిల్,సి.ఎన్. బి.సి.టీవీ 18 వారికి, కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ విజయంలో తన తండ్రి, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రోత్సాహం ఎంతో ఉందని,  ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించామని, అవార్డ్ రావటానికి తమ సహకారాన్ని అందించిన జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఇండియా సి.ఓ.ఓ శివరాం కు,సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు శిద్దా సుధీర్ కుమార్ తెలిపారు.

Related posts

రైతు శ్రేయస్సు కోసమే నూతన వ్యవసాయ విధానం

Satyam NEWS

టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రకటనలు మానుకోవాలి

Satyam NEWS

ప్రజల ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచవద్దు

Satyam NEWS

Leave a Comment