34.2 C
Hyderabad
February 27, 2024 18: 46 PM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

ప్రపంచంలోనే అతి పెద్ద అమేజాన్ సెంటర్ ప్రారంభం

pjimage

ప్రపంచంలోనే అతి పెద్ద అమేజాన్ సెంటర్ హైదరాబాద్ లో ప్రారంభం అయింది. 2016 మార్చి 30న ఈ కేంద్రానికి అప్పటి తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 15 అంతస్తులతో 30 లక్షల చదరపు  అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ నిర్మాణ మైంది. ఇందులో 15 వేల మందికి పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి మహమూద్ ఆలీ , ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ లు నేడు ప్రారంభించారు. 10 ఎకరాల్లో నిర్మించిన సెంటర్ ప్రపంచంలోనే అతి పెద్ద అమేజాన్ సెంటర్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా అమెజాన్ బృందానికి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లే హైదరాబాద్ లో ఐటి పరిశ్రమలు విస్తరిస్తున్నాయని ఆయన ఈ సందర్భంగాచెప్పారు.

Related posts

సంకట హర గణేశం భజే!

Satyam NEWS

జైలు నుంచి విడుదలైన టీడీపీ నేతకు సంఘీభావం

Satyam NEWS

విద్యార్థులపై కుల వివక్ష చూపుతున్న ప్రిన్సిపాల్

Bhavani

Leave a Comment

error: Content is protected !!