39.2 C
Hyderabad
April 16, 2024 18: 43 PM
Slider ముఖ్యంశాలు

హిందువుల ఐక్యత కోసం రామనామం రాసిన వృధ్ధురాలు..!

#Sakuntala

“శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శం..శ్రీరాముని మందిరమే జాతి ప్రగతికి సోపానం”..ఇది అన్నది ఏ గాయకుడో..ఏ రచయితో అనలేదు.12 మంది బిడ్డలను కని వాళ్లను పెంచి పోషించి ప్రయోజకులను చేసిన ఎనభై ఎనిమిదేళ్ల వయస్సున్న‌ ఓ వృధ్ధురాలు చెప్పిన మాటలవి.

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రతీ హిందువూ ఐక్యంగా ఉండాల‌ని… అనుకున్న సమయానికే ఆలయ నిర్మాణం జరగలాని కోరుతూ… ‘శ్రీరామ’ అన్న మూడు అక్షరాలను… రోజూ రాస్తున్నారు. ఇప్ప‌టికే ఆరు  ల‌క్ష‌లకు పైగా శ్రీరామ అన్న అక్ష‌రాలు రాసాన‌ని…మూడు పుస్త‌కాల‌ను శ్రీరామ  అన్న ప‌దాల‌తో నిండిపోయింద‌న్నారు.

త‌న పెనిమిటి రామ‌భ‌క్తుడ‌ని…డ‌జ‌ను మంది పిల్ల‌ల్లో నలుగురు కొడుకుల‌కు రామ‌,ల‌క్ష‌ణ‌,భ‌ర‌త్,శతృఘ్న పేరుల‌ను పెట్టుకున్నామ‌ని వృద్దురాలు శకుంత‌ల గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు.పన్నెండు మంది పిల్లలతో భర్తతో నలభై ఏళ్ల క్రితమే అయోధ్యను దర్శించుకున్నానని చెప్పారు.

Related posts

గుంత‌ల‌ రోడ్లు బాగు చేయాల‌ని బీజేపీ ధ‌ర్నా

Sub Editor

సైబర్ నేరాల బారిన పడితే సత్వరమే పిర్యాదు చేయండి

Satyam NEWS

మహిళలకు అండగా ఉండేందుకే సఖి కేంద్రం

Satyam NEWS

Leave a Comment