28.7 C
Hyderabad
April 25, 2024 06: 47 AM
Slider తెలంగాణ

తప్పుడు ప్రచారంపై జూపల్లి న్యాయపోరాటం

Jupalli

సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కన్నెర్ర చేశారు. మంగళవారం కొల్లాపూర్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. బీజెపి పార్టీలోకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్తున్నట్లు ఫోటోలు  చిత్రీకరించి ఫేస్బుక్ వాట్సాప్  లో షేరింగ్ చేస్తున్నారన్నారు. సిద్దిపేటకు చెందిన నాగరాజు ముచ్చర్ల, కొల్లాపూర్ మూళే కేశవు లను ఇందుకు బాధ్యులుగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గుర్తించారు. వీరి పై ఆయన మండిపడ్డారు. వీరికి కోర్టు ద్వారా నోటీసులు జారీ చేస్తునట్లు తెలిపారు. తనపై కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గౌరవప్రదంగా విలువలతో   ప్రజల కోసం రాజకీయపరంగా తాను ఉన్నట్లు కృష్ణారావు తెలిపారు. తాను బిజెపిలోకి వెళుతున్నట్లు  సోషల్ మీడియాలో తప్పుడు   ప్రచారం  చేస్తున్నారన్నారు.లే నిపోని అసత్యాలు ప్రజలకు తెలియ చేస్తూనరన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన విద్యార్థుల కోసం పార్టీకి  మంత్రి పదవికి రాజీనామా చేసి  కేసీఆర్ వెంబడి తెలంగాణ ఉద్యమంలో నడిచానన్నారు. పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని జూపల్లి అన్నారు.అసత్య ప్రచారాలు చేసిన వారిపై కోటి రూపాయల పరువు దావా నష్టం కేసు వేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలోనే గులాబీ పార్టీలో కొనసాగుతానని తెలిపారు.

Related posts

జీహెచ్ఎంసీ స‌మ‌రానికి సై

Sub Editor

ఆదర్శం: విద్యార్ధుల్ని దత్తత తీసుకున్న తెలుగుదేశం నేతలు

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: సినిమా షూటింగులు రద్దు చేద్దాం

Satyam NEWS

Leave a Comment