39.2 C
Hyderabad
March 29, 2024 15: 15 PM
Slider ముఖ్యంశాలు

నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ వెబ్ సైట్ ఆవిష్క‌రించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

#Minister Indrakaranreddy

నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్  వెబ్ సైట్, నెహ్రూ జూ పార్క్(Nehru Zoo Park) మొబైల్ అప్ ను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్కరించారు.  నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ కు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారాన్ని ఇందులో పొందుప‌రిచార‌ని, జంతు ప్రేమికులు కూడా జంతువుల దత్తత వివ‌రాలను ఈ వెబ్ సైట్ (www.nehruzoopark.in) ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని మంత్రి తెలిపారు.

సంద‌ర్శ‌కులు ఆన్ లైన్ లో త‌మ జూ పార్క్ ప్ర‌వేశ‌ టిక్కెట్లతో పాటు ఇత‌ర సేవ‌ల‌ను బుక్ చేసుకోవ‌చ్చన్నారు. కోవిద్ – 19 లాక్ డౌన్ నేపథ్యంలో  సెంట్రల్  జూ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం సంద‌ర్శ‌కుల‌కు అనుమతి ఇచ్చిన‌  తర్వాత అన్ లైన్ టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పీసీసీఎఫ్  (HoFF) ఆర్. శోభ,  పీసీసీఎఫ్ స్వ‌ర్గం శ్రీనివాస్, అద‌న‌పు పీసీసీఎఫ్ లు డొబ్రియ‌ల్, కుక్రేటి, జూ క్యూరేట‌ర్ క్షితిజ‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు

Satyam NEWS

తిరుపతిలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్ పి

Satyam NEWS

చంద్రబాబు అరెస్టుపై మౌనమేల స్వామీ?

Satyam NEWS

Leave a Comment