31.2 C
Hyderabad
April 19, 2024 06: 04 AM
Slider పశ్చిమగోదావరి

రఘురాముడికి ‘వై’ క్యాటగిరి రక్షణ కల్పించిన కేంద్రం

#RaghuramakrishmanRajuMP

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు కు కేంద్ర ప్రభుత్వం ‘వై’ క్యాటగిరి భద్రత కల్పించింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు తనను బెదిరించడం, తన దిష్టిబొమ్మలు దహనం చేయడం తదితర చర్యలకు పాల్పడుతుండటంతో  రఘురామకృష్ణంరాజు కేంద్రం రక్షణ కోరిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తున్న రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చర్యలపై తన అభిప్రాయం మాత్రమే చెబుతున్నానని వివరణ ఇచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.

రఘురామకృష్ణంరాజుపై ఏపి ప్రభుత్వం కక్షసాధింపు

రఘురామకృష్ణంరాజు కు లోక్ సభ స్పీకర్ తన విచక్షణాధికారాలతో ఇచ్చిన పదవిని తీసేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లేఖ రాసింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తన అభిప్రాయాలు చెబుదామని రఘురామకృష్ణంరాజు ఎంత ప్రయత్నించినా ఆయన అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.

పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రఘురామకృష్ణంరాజుపై పోలీసు కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో బెదిరించడం, దిష్టిబొమ్మలు దహనం చేయడం తరచూ జరుగుతున్నది. ఈ చర్యలన్నీ పార్టీ ఆదేశాల మేరకే జరుగుతున్నట్లు కూడా సదరు నాయకులే ఆఫ్ ద రికార్డు చెబుతున్నారు.

పార్టీ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతున్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని పోలీసులు తనకు రక్షణ కల్పించలేరని స్థిర నిర్ణయానికి వచ్చిన రఘురామకృష్ణంరాజు స్వయంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిసి రక్షణ కోరారు. కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించి రఘురామకృష్ణంరాజుకు 11 మందితో కూడిన భద్రత ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇలా రక్షణ కల్పించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై శాంతి భద్రతల విషయంలో నమ్మకంగా లేనట్లు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసినట్లు అయింది.

Related posts

టిఆర్ఎస్, కాంగ్రెస్ లను తిరస్కరించండి

Satyam NEWS

ప‌ని చేసిన కంపెనీలో దొంగ‌త‌నం..ఏడాది నుంచీ జ‌రుగుతున్న చోరీ

Satyam NEWS

స్మగ్లర్లకు సహాయం చేసిన తిరుపతి స్థానికుడి అరెస్టు

Satyam NEWS

Leave a Comment