32.7 C
Hyderabad
March 29, 2024 12: 11 PM
Slider ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ లో అరాచ‌క పాల‌న‌ ఇంకా ఎన్నాళ్లు?

#prasuna

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న దురాగ‌తాల‌కు వైసీపీ అధ్య‌క్షుడు, రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పాల‌నే కార‌ణ‌మ‌ని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. జగన్ రెడ్డి, ఆయన బూతులు మంత్రి వర్గం రాష్ట్రాన్ని అధోగతి పట్టించారని ఆమె తెలిపారు.

డాక్టర్లు వద్దన్నా ప్రాణాలను కూడా లెక్కచేయకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల దీక్షకు తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూన్నట్లు ఆమె తెలిపారు. ప్రణాళికబద్ధంగా వైసీపీ ప్రభుత్వం దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడులు చేయించడం దుర్మార్గమని ఆమె అన్నారు. ఇది ముమ్మాటికీ పిరికి పందల చర్యగా ఆమె వర్ణించారు.

విచక్షణా రహితంగా పార్టీ కార్యాలయంలో సిబ్బందిపై, కర్రలు, సుత్తితో కొట్టి, రక్తం కారుతూ ఉంటే అది చూస్తూ పైశాచిక ఆనందం పొందే ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. డ్రగ్స్ రవాణా చేస్తూ జగయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే కొడుకును తెలంగాణా పోలీసులు రెడ్ హ్యడెండ్‌గా పట్టుకున్నారు. అది నిజం కాదా అని కాట్రగడ్డ ప్రసూన ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్ముతున్నవారు జగన్ రెడ్డి అనుచరులు అని ఆంధ్రప్రదేశ్ అంత కోడైకూస్తుంది. అందుకే పట్టాభి ప్రెస్‌మీట్ పెట్టగానే ఉలిక్కిపడి దాడులు చేశారని ఆమె అన్నారు.

కచ్చితంగా ఇంకా 2ఏళ్ల‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె తెలిపారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, ఆస్తులపై దాడులు, గొడవలు ప్రోత్సహించడం సమంజసమా?. దాడులు చేసేది వైసీపీ వాళ్లే. కేసులు పెట్టించేది వైసీపీ వాళ్లే. పోలీసు వ్యవస్థ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే నం-1లో ఉంది. ఇప్పుడు వైస్సార్సీపీ ప్రభుత్వంలో మీ స్థానం ఏంటో ఒకసారి ఆలోచించండని ఆమె ప్రజల్ని కోరారు.

చంద్రబాబును నడి రోడ్డుపై జగన్ మోహన్ రెడ్డి ఉరి తీయాలని అన్నప్పుడు చంద్రబాబు మమ్మ‌ల్ని జగన్‌లాగా దాడి చేయమని ప్రోత్సహించలేదు. వాక్ స్వాతంత్య్రం ఉంది అని వదిలేసారు. అదే ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఇలానే అనుకుంటే జగన్ మోహన్ రెడ్డి ఏనాడో బెంగళూరు ప్యాలస్‌కే పరిమిత‌మ‌య్యేవారని ఆమె తెలిపారు. దాడులు సంస్కృతికి తెరపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తెలుగుదేశం తలచుకుంటే వైసీపీ గూండాలను రాష్ట్రం వదిలి పారిపోయేదాక తరిమికొడుతాం అని కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన హెచ్చ‌రించారు.

Related posts

అద్భుత అవకాశం

Satyam NEWS

వెరైటీ: నెల్లూరు నగరంలో రౌడీ మేలా

Satyam NEWS

కోతుల సామూహిక మరణం: విషప్రయోగమే కారణమా?

Bhavani

Leave a Comment