ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసు ఫిబ్రవరి 7 వ తేదీకి వాయిదా పడింది. వై ఎస్ జగన్ నేడు కూడా సిబిఐ కోర్టు ఎదుట హాజరు కాలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా దాన్ని సిబిఐ కోర్టు తోసి పుచ్చింది. హోదాతో సంబంధం లేకుండా కోర్టుకు హాజరు కావాల్సిందేనని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. దాంతో ఈ తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు లో మినహాయింపు పిటీషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో నేడు కూడా జగన్ కోర్టు కు హాజరు కాలేదు. ఇదే విషయాన్ని చెప్పడంతో నేడు జగన్ ఆబ్సెంట్ పిటీషన్ కు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది.
previous post
next post