33.2 C
Hyderabad
April 26, 2024 00: 52 AM
Slider విజయనగరం

ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు సీఎం జ‌గ‌న్ పెద్ద పీట‌…!

#KolagatlaShravani

ప్రజల ఆరోగ్య భద్ర‌త‌కు కు  సీఎం జ‌గ‌న్  పెద్దపీట వేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. విజ‌య‌న‌గ‌రంలోని 11వ డివిజన్ పరిధి అశోక్ నగర్ లోని షాదీఖానా లో తిరుమల హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ఏపీగా తీర్చిదిద్దేందుకు సీఎం జ‌గ‌న్,డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు, ప్రభుత్వ ఆసుపత్రులలో నాడు నేడు,104,108 అంబులెన్స్లు ఏర్పాటు తదితర కార్యక్రమాలు చేపట్టారన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం లో సేవలతో పాటు, స్వచ్ఛందంగా ఆస్పత్రి యాజమాన్యం పేద ప్రజల నివాస ప్రాంతాలు లో  వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఇతరులకు స్ఫూర్తిదాయకం అన్నారు. 2200 వైద్య సేవలను ప్రజలకు  ఉచితంగా అందించే విధంగా వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం లో చేర్చడం జరిగింది అన్నారు.

తిరుమల హాస్పిటల్ యాజమాన్యం గత కొంత కాలంగా పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి , వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. తిరుమల హాస్పిటల్స్ యాజమాన్య సేవా స్ఫూర్తిని చూసి, నగరంలో మరిన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.

పార్టీ శ్రేణులు కూడా సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ముందు స్థానంలో ఉన్నారన్నారు. డీవీజన్ పార్టీ అధ్యక్షులు వెంప డా పు శ్రీనివాస రావు మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ  సందర్భంగా వార్డు ప్రజలకు గుండె, కళ్ళు, ఎముకలు, దంతాలు తదితర సంబంధిత పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ పార్టీ అభ్యర్థిని వెంప డా పు విజయలక్ష్మి, వి. కళ్యాణ్ కుమార్, పొట్నూరు పాపారావు, సుధా, భాష, లక్ష్మణ రావు పాల్గొనగా డాక్టర్ జ్యోతి, డాక్టర్ వేదవతి, డాక్టర్ చంద్రావతి, డాక్టర్ రవళి, డాక్టర్ దివ్య వైద్య సేవలు అందించారు.

Related posts

మూగజీవాల దప్పిక తీరుస్తున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్

Satyam NEWS

ఆటిజం నివారణకు పిన్నాకిల్ బ్లూమ్స్ ప్రతిపాదన

Satyam NEWS

17న గంటలో కోటి మొక్కలు నాటేందుకు అక్కినేని పిలుపు

Satyam NEWS

Leave a Comment