32.2 C
Hyderabad
March 29, 2024 01: 06 AM
Slider గుంటూరు

కరోనా కట్టడిలో వై ఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యo

#Chadalawada 1

కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం  పూర్తిగా చేతులెత్తేసిందని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ఒక్క ప్రయత్నం కూడా చేయకపోవడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు.

కరోనా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన  వైసీపీ ప్రభుత్వం పై సమరభేరి కార్యక్రమంలో నేడు ఆయన పాల్గొన్నారు. వర్చువల్ యాజిటేషన్, డిజిటల్ ఫ్లకార్డులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అరవింద బాబు మాట్లాడుతూ ఏపీ లో మార్చి 21న 5 కేసులు ఉంటే, జూన్ 24 న 10,331 కేసులకు చేరాయి.

అదే జులై 20 న 53,724 కు చేరాయి మరి నేటికి 72,711 కేసులకు చేరుకున్నాయి. జగన్ రెడ్డి నిర్లక్ష్యం వలన కరోనా కేసులలో రోజువారి పెరుగుదలతో దేశం లో 2 వ స్థానం, మరణాలలో 4 వ స్థానానికి ఏపీ చేరుకుంద అని అన్నారు. నిన్న ఒక్క రోజే 7998  కేసులు రావటం రికార్డు సృష్టించిందని ఆయన తెలిపారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పారాసిటమాల్ , బ్లీచి౦గ్ తో పోతుందని అంటున్నారని ఆయన తెలిపారు.

కరోనాపై సిఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

కరోనా ఎవరికి అయినా వస్తుంది, పోతుంది అని బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం దారుణమని ఆయన అన్నారు. వైద్య పరిక్షల నిర్వహణలో వైఫల్యం చెందిన వైసీపీ నాయకులు కరోనా చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారని ఆయన అన్నారు. కరోనా కట్టడికి కేద్రం పంపిన నిధులు పక్కదారి మళ్ళించి,  పేదలకు ఒక్క రూపాయి సహాయం కూడా అందించ లేదు.

ప్రశ్నించిన వారిపై పిచ్చివానిగా ముద్రవేసి,అధికారులను సస్పెండ్ చేసి, దాడులు చేసారు అని ఆయన అన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి 10 వేల ఆర్ధిక సహాయం అందించాలి. కరోనా విధులలో చనిపోయిన ఫ్రంట్ లైన్ వారియర్స్ (డాక్టర్లు,నర్సులు,వైద్య సిబ్బంది,పోలీసులు ,పారిశుధ్య కార్మికులకు) 50 లక్షల రూపాయలు పరిహారం వెంటనే చెల్లించాలి.

జర్నలిస్టు,మీడియా ప్రతినిధులు ఫ్రంట్ లైన్ వారియర్సల జాబితాలో చేర్చి మృతి చెందిన జర్నలిస్టులకు కోటి రూపాయలు, కరోనా తో మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షలు పరిహారం ఇవ్వాలి. మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలి. ఆసుపత్రిలో, క్వారంటైన్ కేంద్రాలలో బెడ్స్ సంఖ్య పెంచాలి ఏ విధమయిన కొరత లేకుండా అక్సిజన్,మందులు సరఫరా చేయాలి, అంబులెన్సులు రోగులకు సకాలంలో అందుబాటులో ఉంచాలి. రేషన్ డిపో డీలర్లకు భీమా సౌకర్యం కల్పించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని డాక్టర్ చదలవాడ తెలిపారు.

Related posts

రాక్షసానందం పొందుతున్న సోషల్ మీడియా

Satyam NEWS

ఓవర్ యాక్షన్: కోటప్పకొండలో పోలీసుల తీరుపై అలిగిన ఈవో

Satyam NEWS

అక్రమాలు చేసిన వారే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment