27.7 C
Hyderabad
April 20, 2024 00: 29 AM
Slider విశాఖపట్నం

ముహూర్తం ఫిక్స్: ఆగస్టు 13న విశాఖకు జగన్

#CM Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ లో క్యాంపు కార్యాలయం ప్రారంభించబోతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయన విశాఖపట్నంలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లే కనిపిస్తున్నది.

ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 13న విశాఖ పట్నం వెళుతున్నారు. 13వ తేదీ హిందూ మత విశ్వాసం ప్రకారం అత్యంత పవిత్రమైన రోజు. ఆ రోజు శ్రావణ శుద్ధ పంచమి. ఆ రోజును గరుడ పంచమి అని కూడా అంటారు.

ఈ పవిత్రమైన రోజున విశాఖ పట్నంలో ప్రవేశం చేయాల్సిందిగా జగన్ హిందూ ఆధ్యాత్మిక గురువు విశాఖ శారదా పీఠం అధిపతి సరస్వతీనందేంద్ర స్వామి ఉపదేశించినట్లు చెబుతున్నారు. ఆ రోజున విశాఖపట్నంలో ప్రవేశం చేస్తే ఇక అంతా శుభమే జరుగుతుందని ఆయన చెప్పినట్లుగా తెలిసింది.

మూడు రాజధానుల వ్యవహారం కోర్టు కేసుల్లో ఉన్నందున దానిపై నిర్ణయం తీసుకోవడానికి ఇప్పటిలో వీలు కాదు. అందువల్ల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తరలించుకుంటున్నాం అంటే కోర్టులు కూడా అభ్యంతరం పెట్టేందుకు అవకాశం లేదు. ఈ కారణంతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విశాఖ లో ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం తరలి వెళితే దాదాపుగా అదే పాలనా వ్యవహారాల రాజధాని అవుతుంది.

అందుకే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 13న విశాఖ పట్నంలో రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇప్పటి వరకూ చెప్పిన అధికారిక కార్యక్రమాల ప్రకారం ఆ రోజు విశాఖ నగరంలో రూ .132 కోట్లతో నిర్మించిన ఎస్ఏడీ ఫ్లె ఓవర్ బ్రిడ్జి ని ప్రారంభించనున్నారు.

రుషికొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు 26 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కూడా సిఎం ప్రారంభించనున్నారు. అయితే అదే రోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం  ప్రారంభోత్సవం కూడా అక్కడ ఉంటుందని అంటున్నారు.

అధికారిక కార్యక్రమాలకు జీవీఎంసీ, వీఎంఆర్ డీఏ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 15 వేడుకలు కూడా అక్కడే నిర్వహించే వీలుంది.

ఈ నెల 25న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు వెలువడనున్నది. ఈ లోపునే విశాఖపట్నంలో రంగ ప్రవేశం జరిపితే మంచి జరుగుతుందని శారదా పీఠం అధిపతి తెలిపినట్లుగా చెబుతున్నారు.

Related posts

ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక సాయం చేసి వారికి జైలు

Satyam NEWS

సమస్యలకు త్వరగా పరిష్కారం చూపాలి

Bhavani

సైకో కిల్లింగ్: ఇంటర్‌ విద్యార్థిని దారుణంగా హత్య చేశాడు

Satyam NEWS

Leave a Comment