వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వదేశానికి బయలుదేరారు. 24 తేదీ తాడేపల్లి లోని తన నివాసానికి ఆయన చేరుకుంటారు. ఈనెల 16 న కుటుంబ సభ్యులతో కలిసి సీఎం వైఎస్ జగన్ అమెరికా వెళ్లిన విషయం విదితమే. అమెరికాలోని పలువురు ప్రవాస భారతీయులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలతో సీఎం వైఎస్ జగన్ చర్చలు జరిపారు. వారందరిని ఏపీ లో పెట్టుబడులు పెట్టాలని అభ్యర్ధించారు. ఈ అధికారిక కార్యకలాపాలతో బాటు ఆయన తన వ్యక్తిగత పనులను కూడా ఈ అమెరికా పర్యటనలో పూర్తి చేసుకున్నారు.
previous post
next post