28.2 C
Hyderabad
March 27, 2023 09: 46 AM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

పారదర్శకత లేని జగన్ ప్రభుత్వం

Pawan-Kalyan-Nadendla-Manohar

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రకటించిన నవరత్నాలు జనరంజకమైనవే కానీ వైసీపీ పాలన మాత్రం జన విరుద్ధమైనదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి లో జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంవత్సరం వరకు మాట్లాడే అవకాశం రాదనుకున్నాం. రెండు వారాల్లోనే ప్రభుత్వ నిర్ణయాలు ఆందోళనకరంగా మారాయి. ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రాభివృద్ధిని ప్రశ్నార్థకం చేశాయి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాను అరికట్టడంలో వైసీపీ విఫలం అయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పాలన పై పవన్ కళ్యాణ్ పుస్తకం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 9 అంశాల పై 10 టీమ్ ల తో సర్వే చేశామని ఆ వివరాలనే ఇప్పడు వెల్లడిస్తున్నామని ఆయన అన్నారు. ఇసుక, అమరావతి రాజధాని అనిచ్చితి, గృహనిర్మాణం, తదితర అంశాలు, అశాంతి, శాంతిభద్రత లు ,రైతాంగం అంశాలు గురించి సర్వేలో ప్రస్తావన చేశామని ఆయన తెలిపారు. వైసిపి పాలన పారదర్శకత లేని విధంగా ఉందని ఆయన అన్నారు. సుమారు 50 రహస్య జీఓ లు జారీ చేసారని ఆయన తెలిపారు.

Related posts

పంజాబ్ లో కొత్త ఫిట్టింగ్ పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ

Satyam NEWS

కేసీఆర్ పాలనలో తెలంగాణ దిగజారిపోయింది

Satyam NEWS

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భీమ్లానాయక్‌ ఎలివేషన్‌ !

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!