27.7 C
Hyderabad
April 20, 2024 00: 35 AM
Slider కడప

సీపీబ్రౌన్ గ్రంధాలయ అభ్యన్నతికి వైస్సార్ సహకారం మరువలేనిది

#YSR Kadapa

సీపీబ్రౌన్ గ్రంధాలయాన్ని 2005 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రత్యేక నిధులు మంజూరు చేసి గ్రంథాలయ అభ్యున్నతికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై యస్ రాజశేఖర రెడ్డి సహకారం మరువలేనిది యోగివేమన ఉపకులపతి ఆచార్య ఎం సూర్య కళావతి పేర్కొన్నారు.

కడప నగరంలోని   సీపీబ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో బుధవారం వైస్సార్ 71 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ గ్రంధాలయ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రీ కోరిక మేరకు 2005 లో ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని రూ..15 లక్షల నిధిని కేటాయించి శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయానికి అప్పగించారు.

2008లో యోగివేమన విశ్వ విద్యాలయంలో విలీనం చేయడంతో సీపీబ్రౌన్ గ్రంధాలయం భాషా పరిశోధన కేంద్రంగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో కులసచివులు విజయ రాఘవ,కేంద్రం బాద్యులు డాక్టర్ మూల మల్లి కార్జున రెడ్డి,కేంద్ర సహాయ పరిశోధకులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి,చింతకుంట శివారెడ్డి,గ్రంధపాలకుడు రమేష్,గ్రంథాలయ సిబ్బంది పాల్గొని నివాళ్ళు అర్పించారు.

Related posts

కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్

Satyam NEWS

భక్తి ముసుగులో పిల్లల అపహరణ..పోలీసుల అదుపులో దొంగ స్వామీజీ…!

Satyam NEWS

కర్ఫ్యూ సడలింపు: నిబంధనల అమలుపై సడలిన ఖాకీలు..!

Satyam NEWS

Leave a Comment