27.7 C
Hyderabad
April 26, 2024 05: 14 AM
Slider నల్గొండ

ఆరోగ్య కేంద్రానికి ఆక్సీమీటర్లు విరాళంగా ఇచ్చిన యాదాద్రి అర్చకులు

#yadadri temple

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి అర్చకులు ఈ కరోనా సమయంలో తమ సహృదయాన్ని చాటుకున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాధిగ్రస్తుల్ని పరీక్షించేందుకు పల్స్ ఆక్సీమీటర్లు కొని విరాళంగా ఇచ్చారు.

యాదాద్రి అర్చకులు కే.మాధవాచార్యులు మూడు ఆక్సీమీటర్లు ఇవ్వగా ఫణి కుమార్ శర్మ రెండు ఆక్సీమీటర్లు అందించారు.

కే.వెంకటాచార్యులు, యం.నరసింహమూర్తి, కే.అరుణ్ కుమారాచార్యులు, యం.శ్రీధరాచార్యులు, యస్.శ్రీనాథాచార్యులు, కే.శ్రీకాంతాచార్యులు, బి.సురేంద్రాచార్యులు, పి.భాష్యకారాచార్యులు, యం..ప్రణీతాచార్యులు, టి భరత్ కుమారాచార్యులు ఒక్కొక్కటి చొప్పున అందించారు.

యాదాద్రి అర్చకులు మొత్తం సుమారు రూ.22,500 చందాల ద్వారా సమకూర్చారు. ఒక్కొక్కటి రూ.1500 విలువ గల 15 ఆక్సీమీటర్లను కొని యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందచేశారు.

ఆసుపత్రి సిబ్బంది  నర్సులు,ఆశా వర్కర్లు వీటితో రోగులను పరీక్షించే వీలుకలిగింది.

Related posts

రేపటి నుంచి మారుతున్న పలు నిబంధనలు

Satyam NEWS

ఖమ్మం జిల్లా మధిరలో ముగిసిన క్రికెట్ పోటీలు

Satyam NEWS

కరీంనగర్ లోతట్టు ప్రాంతాల్లో మంత్రి గంగుల పర్యటన

Satyam NEWS

Leave a Comment