39.2 C
Hyderabad
April 25, 2024 16: 54 PM
Slider హైదరాబాద్

యాదవ కులాల స్మశాన స్థలాన్ని ప్రభుత్వం కాపాడాలి

#amberpet

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బతుకమ్మ కుంట సబ్ స్టేషన్ పక్కన ఉన్న స్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం కాపాడాలని సామాజిక కార్యకర్త కె.వెంకటనారాయణ కోరారు. ఆ స్థలంలోని సమాధులను కొందరు ధ్వంసం చేసి వైన్స్ షాప్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. బాగ్అంబర్పేట డివిజన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన          మాట్లాడుతూ ప్రభుత్వం ఈ స్మశాన వాటిక స్థలం యాదవ కులస్తులకు గతంలో కేటాయించిందని ఆయన తెలిపారు. సర్వే నెంబర్: 570/1, TSLR టౌన్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ నెంబర్: 100, వార్డ్ నెంబర్: 164, బ్లాక్ నెంబర్: J, గ్రామం: అంబర్పేట్ సర్ఫాకాస్, కాత నెంబర్: 197, అంబర్పేట్ అర్బన్, జిల్లా: హైదరాబాద్, సంవత్సరం: 1973 ప్రకారం ఈ స్థలం పూర్తి విస్తీర్ణం రెండు గుంటలు అని ఆయన చెప్పారు. మొత్తం 244 చదరపు గజాల ఈ స్థలం మార్కెట్ వాల్యూ ప్రకారం 3 కోట్ల 66 లక్షల రూపాయల వరకూ ఉంటుందని ఆయన అన్నారు. ఇంత ఖరీదైన ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించారని ఆయన తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రెవిన్యూ శాఖ వారు దీనిపై చొరవ చూపి వెంటనే స్థలాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఈ స్థలంపై సర్వహక్కులు యాదవ కులస్తులకే ఉన్నాయన్నారు.

Related posts

జాతీయ రహదారి ఏర్పాటుకు అనుమతుల పట్ల హర్షం

Satyam NEWS

రివెంజ్ సక్సెస్:ఇరాన్ దాడిలో గాయపడ్డది నిజమే

Satyam NEWS

రానా విరాట ప‌ర్వం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sub Editor

Leave a Comment