తెలుగుదేశం పార్టీ నాయకుడు, చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు అయిన గుంటూరు జిల్లా, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కేసుల విచారణను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం వైఎస్ జగన్ సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడులో ఆయన అక్రమంగా గనులను తవ్వి, వందల కోట్ల రూపాయలను వెనకేసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి. యరపతినేనిపై ఆరోపణలు తీవ్రమైనవని కోర్టుకు సర్కార్ వివరించింది. అందుకే ఈ దాచేపల్లి అక్రమ మైనింగ్ కేసు సీబీఐకి అప్పగిస్తున్నట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇకపై సీబీఐ ఈ కేసును చూసుకుంటుందని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఇదే తొలి సీబీఐ విచారణ.
previous post