సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి అతి సమీపములో గల యర్రారం శ్రీ బాల ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అనంతరం హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరులతో ప్రముఖ వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణ మాట్లాడుతూ స్వామివారు స్వయంభువుగా వెలిసిన స్థలాన్ని, స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని,దర్శించుకున్న భక్తులందరూ ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారని, అంతేకాకుండా యాదగిరిగట్ట,మట్టపల్లి వంటి మహా క్షేత్రాల్లో స్వయంభువుగా వెలసినట్టు పెద్దలు,చరిత్ర చెబితే వినడమే కానీ చూడలేదని,అట్టి మహా భాగ్యాన్ని మనం యర్రారంలో చూస్తున్నామని, యర్రారానికి వచ్చిన భక్తుల కోర్కెలు నెరవేరడంతో భక్తులు మరల మరల వస్తున్నారని అన్నారు.
యర్రారం పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని,వాటిని భక్తులు త్రిప్పికొడతారని అన్నారు.కలియుగంలో ధర్మానికి ఆటంకం కలుగుతున్నపుడు భగవంతుడు ఇలా అవతరిస్తూ ఉంటాడని, స్వామివారు ఇక్కడే వెలవడానికి గల కారణం ఏమటీ?ఇక్కడ ఏ ఏ దేవతా చైతన్యం ఉన్నది?అనే అనేక ప్రశ్నలకు మనకు సమాధానం లబించాలంటే ప్రాచీన భారతీయ జ్యోతిష్యం శాస్త్రం లోని అష్టమంగళ ప్రశ్నలో భాగమైన దేవ ప్రశ్న చేయవలసి ఉన్నదని,ప్రస్తుతం ఈ ప్రశ్న చేయగలిగే వారు కేరళ రాష్ట్రం మాత్రమే ఉన్నారని,వారిని పిలిపించి దేవ ప్రశ్న చేసి భక్తులంతా కలిసి దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని జ్ఞానరత్న,వాస్తురత్న అవార్డ్ గ్రహీత మామిడి సత్యనారాయణ అన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్