22.6 C
Hyderabad
August 13, 2020 16: 16 PM
Slider కృష్ణ

ముందు నుండి వైసిపి, వెనుక నుండి బిజేపి వెన్నుపోటు

#Amaravathi JAC

అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు సమాధానం చెప్పిన తరువాతే రాజధానిని తరలించాలని అమరావతి పరిరక్షణ సమితి మహిళా జెఏసీ కన్వీనర్, సిపిఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ డిమాండ్ చేశారు. విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ కార్యాలయంలో శనివారం మహిళా జెఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వనజ మాట్లాడుతూ మహిళలకు ఇష్టమైన వరలక్ష్మీ వ్రతం రోజు గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం తెలపడం చీకటి రోజు అన్నారు. కర్నూలుకు హైకోర్టు ఇచ్చినమాత్రాన రాయలసీమ అభివృద్ధి జరగదని రాయలసీమ ప్రజలు ఈ నిర్ణయంను ఆహ్వానించడం లేదని తెలిపారు.

విశాఖపట్నంలో కొత్తగా అభివృద్ధి చేయవల్సింది ఏమి లేదని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చి ఇప్పుడు రాజధానిని చంపుతారా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు రెండు నాల్కోల ధోరణలో మాట్లాడి అమరావతి రైతులను అయోమయంలోకి నెట్టిందని, కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమి చేయదలిచారో బహిర్గతం చేయాలని కోరారు.

గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానికి రాజధాని తరలించమని ఆఫీడివిట్ ఇచ్చి బిల్లును ఆమోదించడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజకీయపార్టీలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Related posts

రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేందుకు పక్కా ప్లాన్

Satyam NEWS

సోషల్ మీడియా షేరింగ్ పై అరెస్టు చేసిన వ్యక్తి మృతి

Satyam NEWS

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమౌతున్న ఏపి ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!