వైసీపీ పాత కుట్రలనే ఇంకా నమ్ముకుంది. తప్పదుమరి…ఎందుకంటే ఫేక్ రాజకీయం, తప్పుడు ప్రచారం వాళ్ల డిఎన్ఎలోనే ఉంది. ఇటు అమరావతి పై విషం చిమ్ముతూ…..అటు ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచేందుకు శక్తి మేర ప్రయత్నం చేస్తోంది. దీని కోసం పేటిఎం బ్యాచ్ తో పాటు….మేధావుల ముసుగులో ఉన్న ఇతర రాష్ట్రాల వారినీ రంగంలోకి దింపింది. వాస్తవంగా రాజధాని మాత్రమే అమరావతిలో ఉంటుంది. కానీ నాడు – నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ది వికేంద్రీకరణకు కట్టుబడి పనిచేసింది. చేస్తుంది.
నాడు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్ధలు తీసుకువచ్చి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా అభివృద్ది వికేంద్రీకరణ వైపే అడుగులు వేస్తోంది. TCS, GOOGLE వంటి ప్రతిష్టాత్మక ఐటీ సంస్థలను వైజాగ్ లో ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రాన్ని డ్రోన్ హబ్ గా మార్చేందుకు కర్నూల్ కేంద్రంగా 300 ఎకరాల్లో డ్రోన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. మానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలను రాయలసీమలో ఏర్పాటు చేస్తోంది. కొత్త కంపెనీలను శ్రీ సిటీ కి తీసుకువస్తోంది.
ఇప్పటి వరకు రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోగా….వీటిలో ఎక్కువ భాగం ఉత్తరాంధ్రకు, రాయలసీమకు కేటాయించింది. అయితే అబద్దాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలనుకునే దుష్టరాజకీయమే తమ పార్టీ సిద్దాంతంగా భావించే వైసీపీ అదే దారిని ఎంచుకుంది.
రూ.5 వేల కోట్లతో కొప్పొర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ కారిడార్లు
కర్నూలులో డ్రోన్ హబ్ ఏర్పాటుకు 300 ఎకరాల కేటాయింపు.
విశాఖ రైల్వే జోన్ కు లైన్ క్లియర్ – మళ్లీ విశాఖలో వాళ్లు తరిమేసిన లులు గ్రూప్
రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు SIPBలో ఆమోదం. దీంతో 34 వేల ఉద్యోగాలు
రాష్ట్రానికి పెద్దఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు – పోర్టులు, ఎయిర్ పోర్టులు
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ భాగస్వామ్యంతో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు
భోగాపురం ఎయిర పోర్టుతో పాటు పోర్టుల సత్వర పూర్తికి ప్రయత్నాలు
ఎకో, టెంపుల్ టూరిజం కేంద్రాలుగా సీమ జిల్లాలు, కోస్తాలో బీచ్ టూరిజం ప్రాజెక్టులు