22.2 C
Hyderabad
December 10, 2024 11: 20 AM
Slider ప్రత్యేకం

జగన్‌ గుండెజారి గల్లంతయిందే…!!

#jagan

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏపీలో వైసీపీని నిజంగానే జీరోను చేసేలానే ఉన్నాయన్న వాదనలకు అంతకంతకూ బలం చేకూరుతోంది. 2019 ఎన్నికల్లో అధికారం దక్కిన తర్వాత… ఇక 30 ఏళ్ల వరకు మనల్ని అధికారం నుంచి దించే వారెవరూ లేరని వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జగన్ మాట నిజమేనని ఆయన అనుంగులు కూడా భావించారు. అలాంటి జగన్ అనుంగుల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా, జగన్ కేబినెట్ లో చదువు రాని జలవనరుల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న అనిల్ కుమార్ యాదవ్ ఒకరు.

పెద్ద గొంతేసుకుని వైరివర్గాల మీద పడిపోయే ఆయన ఇప్పుడు వాస్తవం తెలుసుకుని జగన్ కు దూరం జరిగేందుకు పావులు కదుపుతున్నారట. అనిల్ ఒక్కరే కాదు… అనిల్ మాదిరే జగన్ ను నమ్మి తన రాజకీయ జీవితాన్నే ప్రశ్నార్థకం చేసుకున్న పెడన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా వైసీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. కాంగ్రెస్ లో చోటామోటా నేతగా ఉన్న అనిల్… దివంగత సీఎం వైఎస్ రాజేఖరరెడ్డి మరణం, ఆపై జగన్ కాంగ్రెస్ ను వీడి వైసీపీని ప్రారంభించడంతో ఒక్కసారిగా పెద్ద నేత అయిపోయారు.

కొత్త పార్టీలో తనకున్న నోటిని వినియోగించిన అనిల్… అనతి కాలంలోనే జగన్ దృష్టిలో పడిపోయారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ టికెట్ ను ఇప్పించుకున్నారు. ఏకంగా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… ఆపై మంత్రి కూడా అయిపోయారు. బీసీ సామాజిక ర్గానికి చెందిన అనిల్… రాజకీయంగా మరింత పురోభివృద్ధిలోకి రావాల్సిన ఈ సమయంలో జగన్ తీసుకున్న ఓ నిర్ణయం ఆయనను జీరోను చేసి పారేసింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ కాదని… అనిల్ ను ఏకంగా ఆయన సొంత జిల్లా నెల్లూరును దాటించి పల్నాడు జిల్లాలో నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు.

టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా, విద్యావంతుడిగా పేరున్న లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో అనిల్ చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడేం చేయాలో కూడా అనిల్ కు పాలుపోవడం లేదు. గత ఎన్నికల సందర్భంగా తాను విజయం సాధించకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన అనిల్… ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్లడానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారు. ఇక జోగి రమేశ్ విషయానికి వస్తే…అనిల్ మాదిరే బీసీ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేశ్ కాంగ్రెస్ నుంచే వైసీపీలోకి వచ్చారు.

వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే వల్లమాలిన అభిమానం చూపించే జోగి… జగన్ అంటే ప్రాణం ఇస్తానంటూ సెటైరిక్ డైలాగులు పేల్చేశారు. 2019 ఎన్నికలకు ముందు నుంచి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కేంద్రంగా రాజకీయాలు చేసిన జోగి… అక్కడి నుంచే 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ అధికారంలో ఉండగా…నాడు విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేసేందుకు మందీమార్బలాన్ని వేసుకుని వెళ్లిన జోగి… జగన్ దగ్గర మరిన్ని మార్కులు కొట్టేశారు.

ఈ క్రమంలోనే ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జోగికి జగన్ మంత్రి పదవి ఇచ్చారు. మొన్నటి ఎన్నికల దాకా ఆయన మంత్రిగానే కొనసాగినా… అనిల్ మాదిరే జోగి కూడా జగన్ షఫిలింగ్ డెసిషన్ కు బయల్యారు. అప్పటిదాకా తనకు పట్టున్న పెడనను కాదని పెనమలూరు నుంచి జోగిని పోటీ చేయించారు. ఫలితంగా టీడీపీ నేత బోడె ప్రసాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఆపై చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నం, అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి కుమారుడి అరెస్ట్, విడుదల..తదితర పరిణామాల నేపథ్యంలో జగన్ కు దూరం జరగాలని జోగి నిర్ణయించుకున్నారు.

ఈ కారణంగానే ఆదివారం జరిగిన దేవినేని అవినాశ్ పదవీ ప్రమాణానికి జోగి డుమ్మా కొట్టారు. అటు అనిల్ అయినా, ఇటు జోగి అయినా… జగన్ తీసుకున్న షఫిలింగ్ డెసిషన్ తో దెబ్బైపోయారు. వీరిద్దరే కాకుండా ఇంకా చాలా మంది ఉజ్వల భవిష్యత్తు కలిగిన నేతలు కేవలం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్లనే ప్రమాదంలో పడిపోయారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని కొందరు త్వరలోనే గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోగా… అనిల్, జోగిలు ఆ దిశగా అడుగులు వేయడానికి ఒకింత సమయం పట్టిందంతే. వైసీపీకి గుడ్ బై చెప్పాల్సిందేనని వీరిద్దరూ ఇప్పటికే దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

అంతేకాకుండా సాధ్యమైనంత త్వరగా జగన్ కు దూరం జరగాలని కూడా వారు తీర్మానించుకున్నారట. అయితే వైసీపీని వీడితే తమను అక్కున చేర్చుకునే పార్టీలేమిటన్న దానిపై అనిల్ తర్జనభర్జన పడుతున్నట్లుగా సమాచారం. అయితే రాజకీయంగా వైసీపీని వీడితే… అనిల్ కు ప్రత్యామ్నాయంగా కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేనలు మాత్రమే ఉన్నాయి. ఇక జోగి అయితే జనసేనలో చేరిపోయేందుకు సిద్ధమైపోయారని, ఆయనను చేర్చుకునేందుకు పవన్ కల్యాణ్ కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

Related posts

“మన ఊరు – మన బడి” తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

Satyam NEWS

పేద బ్రాహ్మణులకు ఉచితంగా బ్రాహ్మణ సదన్

Satyam NEWS

సూర్య గ్రహణం లో అయ్యప్ప స్వాములకు సూచన

Satyam NEWS

Leave a Comment