29.2 C
Hyderabad
September 10, 2024 17: 30 PM
Slider సంపాదకీయం

రాజకీయాలు వదిలేసి భయంతో తిరుగుతున్న వైసీపీ నేతలు

#roja

అధికారంలో ఉన్నంత కాలం స్వార్ధంతో పని చేసి, ప్రజలను, ఇతర పార్టీల నాయకులను బూతులు తిట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు కనిపించడం లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూనే వైసీపీ నేతలు కాపలాగా ఎంతో మంది ఉండేవారు. జగన్ ను విపక్ష నేతలు ఎవరైనా పల్లెత్తుమాట అంటే ఊరుకునేవారు కాదు. జగన్ ను ఎవరైనా ఏమైనా అంటే.. అప్పుడు ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్ నాథ్, అంబటి రాంబాబు వంటి వారు ఉరుకులు పరుగుల మీద ప్రెస్ మీట్లు పెట్టేవారు.

అసలు ఏ విషయంలోనూ జగన్ కౌంటర్ ఇచ్చే అవసరం లేకుండానే కిందిస్థాయిలోని ఇలాంటి  నలుగురు నేతలు ప్రతిదానికి ముందుండేవారు. రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, గుడివాడ అమర్ నాథ్ తీరు ఎలా ఉండేదంటే.. జగన్ ప్రస్తావన లేకుండా చంద్రబాబును ఎవరైనా పొగిడినా వీరు ఊరుకునేవారు కాదు. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి సెలబ్రిటీ ఓసారి చంద్రబాబు నాయుడును ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవంలో మెచ్చుకుంటేనే ఈ వైసీపీ బ్యాచ్ అంతా తట్టుకోలేకపోయింది.

అసలు రజినీ.. జగన్ పేరును అస్సలు ఎక్కడా వాడలేదు. కనీసం పరోక్షంగా కూడా విమర్శలు చేయలేదు. అయినా చంద్రబాబును రజినీ కాంత్ పొగిడినందుకు ఈ  నలుగురు నేతలు విపరీతమైన రచ్చ చేశారు. అధికారంలో ఉండగా ఈ రేంజ్‌లో జగన్ కు చేదోడు వాదోడుగా, నోట్లో నాలుకలా  ఉన్న ఈ నలుగురైదుగురు నేతలు ఇప్పుడు జగన్ ఇంటికే పరిమితం  అయ్యాక జాడ లేకుండా  పోయారు. గత కొన్ని రోజులుగా జగన్‌ ఒక్కడే ప్రెస్‌ మీట్‌లు పెడుతున్నారు. ఢిల్లీలోనూ ఆయనే మాట్లాడుతున్నారు.

జగనే నేషనల్ మీడియాకి ఇంటర్‌ వ్యూలు ఇస్తున్నాడు. కానీ, సన్నిహితులుగా చెప్పుకున్న ఈ వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా నోరు మెదపడం లేదు. కనీసం నియోజకవర్గంలోనే కాదు.. ఏపీలోనే కనిపించడం మానేశారు. వారంతా  హైదరాబాద్‌లోని తమ ఇళ్లలో రిలాక్స్ అవుతున్నట్లు టాక్. అధికారం ఉండగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టని జగన్.. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి తానే వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. పైగా  మొన్న ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు కూడా వీరు కనిపించలేదు. అదే అధికారంలో ఉండే తెగ హడావుడి చేసి ఉండేవారు.

ఈ  పరిణామాలను బట్టి.. రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, గుడివాడ అమర్ నాథ్ లాంటివారు తమ అధినేతకు పవర్ ఉన్నంత కాలం ఆయన మెప్పు కోసం తంటాలు పడుతూ వ్యవహరించారు. ఇప్పుడు జగన్ కు పవర్ లేకపోవడం అటుంచి.. 11 సీట్ల ఘోర పరాజయ స్థితిలో ఉన్న వైసీపీ తిరిగి ఎలా నిలబడగులుగుతుందన్న అనుమానం అందరిలోనూ ఉంది. అందుకే అప్పట్లో జగన్ మీద ఈగ వాలనివ్వని నేతలంతా సైలెంట్ ఉన్నారని అంటున్నారు.

Related posts

పుణ్యధాత్రి

Satyam NEWS

ముత్తూట్ ఫైనాన్స్ లో 77 కిలోల బంగారం చోరీ

Satyam NEWS

20, 21 తేదీల్లో పుర‌పాల‌క‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ప‌ర్య‌ట‌న‌

Satyam NEWS

Leave a Comment