39.2 C
Hyderabad
March 28, 2024 13: 50 PM
Slider కడప

అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పేదల భూముల కబ్జా

#cpikadapa

కడప జిల్లాలో పేదల భూములకు రెక్కలు వచ్చాయని, పేదలకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వ పాలకులు అధికార పార్టీ పెద్దలు రెవెన్యూ తాసిల్దార్ లను బెదిరించు కుంటూ పేదల భూములను భూ బకాసురులైన అధికార పార్టీ నాయకులకు కట్టబెడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు.

గురువారం నాడు స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో బద్వేలు, పొరుమామిళ్ల, ఓబులవారిపల్లి, గోపవరం, చిట్వేలి సుండుపల్లి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, వీరబల్లె  మైదుకూరు బ్రహ్మంగారిమఠం ఎర్రగుంట్ల కమలాపురం వీరపనాయునిపల్లి పెండ్లిమర్రి చెన్నూరు వల్లూరు సిద్ధవటం వేంపల్లి  పులివెందుల తొండూరు చక్రాయపేట వేముల తదితర మండలాలలో తాసిల్దార్లు చేతివాటం ప్రదర్శిస్తూ అధికార పార్టీ నాయకులకు పేదల భూములతో పాటు ప్రభుత్వ భూములను హక్కులు కల్పిస్తూ వెబ్ లాండ్ లో రికార్డులను తారుమారు చేయడం ఉన్న భూమిని లేనివాడి పేరుతో ఆన్లైన్ చేస్తూ కోట్ల రూపాయలకు పడగలెత్తిన తాసిల్దార్ లను జిల్లా కలెక్టర్ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.

అసైన్మెంట్ సమావేశాలు జరగకుండా నేరుగా తాసిల్దార్లే ప్రభుత్వ బంజరు భూముల కు డి ఫామ్ పట్టాలు ఇచ్చారని డి ఫామ్ పట్టా భూములను ప్రైవేటు భూములు గా చూపిస్తూ ఆన్లైన్ రికార్డులు మార్చేయడం జరిగిందని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన బెదిరింపు కేసులతో పాటు ఉన్న భూములను కూడా రికార్డులు లేకుండా చేసే పనిలో తాసిల్దార్ లు నిమగ్నమై ప్రజా సేవలు మరిచారని ఆయన అన్నారు.

అక్రమ పద్ధతుల్లో సామాన్యులు ఏ రాజకీయ పలుకుబడి లేకుండా భూ హక్కు నమోదు చేసుకోవడానికి కొటేషన్ చేస్తే నెలల తరబడి చెప్పుకునే రెవెన్యూ అధికారులు లక్షల రూపాయల మామూళ్ల మత్తులో ఉన్నారని ఆయన అన్నారు. ఎటువంటి ఆధారాలు లేని ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములు గా చూపించే ఆన్లైన్ రికార్డు సృష్టించడంలో కడప జిల్లా తాసిల్దార్ లకు ఎవరు సాటిరారు తాసిల్దార్ వందల కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటినుండి  సంపాదించగలిగితే అంటే ఏ స్థాయిలో రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారో అర్థం అవుతుందన్నారు.

ప్రభుత్వం వన్ ప్లస్ అసలు ఇచ్చిన డిజిటల్ కీ లు ప్రభుత్వ సేవలను ఉపయోగించాల్సి ఉంది పోయి ప్రైవేటు వ్యక్తులు వేస్తున్న ఎంగిలి మెతుకులకు ఆశపడి డిజిటల్ కీ లను ఒక మండలం నుండి మరో మండలం వెబ్ ల్యాండ్ లోకి చొరబడి రికార్డులను తారుమారు చేయగలిగారు అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో తెలుస్తుందన్నారు. అక్రమాలకు పాల్పడ్డ రెవెన్యూ అధికారుల పైన విచారణ చేపట్టి  ఉద్యోగం నుండి రిలీవ్ చేయాలని త్వరలో ఆధారాలతో జిల్లా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Related posts

హిట్ గాడ్: శ్రీవారి సేవలోజాను చిత్ర యూనిట్

Satyam NEWS

డివిజనల్ కార్యాలయాలు తరలింపు ఆపాలి: రాజంపేట జిల్లా సాధన సమితి

Satyam NEWS

బాబామెట్ట హజరత్ ఖాదర్ వలీ బాబా వారి ఆశ్ర‌మంలో ఎమ్మెల్యే కోలగట్ల

Satyam NEWS

Leave a Comment