36.2 C
Hyderabad
April 25, 2024 21: 03 PM
Slider విశాఖపట్నం

మునుగోడు తరహా ప్రయోగానికి జగన్ సిద్ధం?

#mindgame

మునుగోడు తరహా ప్రయోగం చేయడానికి వైసీపీ సన్నద్ధం అవుతున్నదా? జరుగుతున్న పరిస్థితులు గమనిస్తే మునుగోడు తరహా ప్రయోగం చేయడనికి వైసీపీ సన్నద్ధం అవుతున్నట్లు కనిపిస్తున్నది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావును తమ పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధమైన వైసీపీ కీలక నేతలు ఈ ప్రయోగానికి ముందుకు వస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ లోని మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తమ పార్టీలోకి తీసుకున్న బీజేపి ఆయనతో రాజీనామా చేయించింది.

ఆయన రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీలో మళ్లీ ఆయననే గెలిపించి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని బిజెపి పెద్దలు భావించారు. అయితే బీజేపీ నేతలు ఆశించినట్లు జరగలేదు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచినట్లయితే తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించి ఉండేదే అని చాలా మంది అనుకున్నారు. అదే తరహాలో గంటా శ్రీనివాసరావును తీసుకుంటున్న వైసీపీ ఆయనతో రాజీనామా చేయించి ఉప ఎన్నిక తీసుకురావాలని భావిస్తున్నది.

గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ గెలుచుకున్న ఈ స్థానానికి ఉప ఎన్నిక తెప్పించి ఈ ఉప ఎన్నికలో గెలవాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు 16 నెలల సమయం ఉన్నందున ఈ లోపు తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీని నైతికంగా దెబ్బ కొట్టాలని వైసీపీ వ్యూహం పన్నిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్రంలో తమకు అనుకూలమైన బీజేపీ ఉన్నందున ఉప ఎన్నికను తమకు ఇష్టమైన రీతిలో జరుపుకుకోవడం పెద్ద కష్టం కాదని, అందువల్ల అక్కడ గెలిచి టీడీపీపై మైండ్ గేమ్ ఆడాలని వైసీపీ ప్లాన్ చేయబోతున్నది. ఈ ప్రయోగం చేయడానికే గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకుంటున్నట్లు చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు పార్టీలో చేరేందుకు ముందగానే అతను రాజీనామా చేయాలనే షరతు విధించారని కూడా అంటున్నారు.

అలా కాకపోతే ఆయన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఇప్పటికే ఆయన చేసిన రాజీనామా స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్నందున దాన్ని ఆమోదించేలా చేస్తారు. ఆశించిన రీతిలో ఆశించిన సమయంలో ఉప ఎన్నిక వచ్చేలా చేసుకుని గెలవాలని వైసీపీ ప్లాన్ చేసుకుంటున్నది. ఇలా చేయడం వల్ల టీడీపీ నైతికంగా బలహీన పడుతుందని కూడా వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఈ ఎన్నికలలో జనసేన పోటీ చేయకుండా బీజేపీ ద్వారా కట్టడి చేయడానికి కూడా ఇప్పటికే పావులు కదిపినట్లుగా కూడా చెబుతున్నారు. జన సేన పోటీ చేయకుండా ప్లాన్ వేయడం ద్వారా గెలుపును ఖరారు చేసుకోవాలని కూడా వైసీపీ కీలక నేతలు భావిస్తున్నారని అంటున్నారు. జనసేన అసలు అభ్యర్ధిని పెట్టకుండా, ఒక వేళ పెట్టినా తాను సూచించిన వ్యక్తిని అభ్యర్ధిగా పెట్టేలా గంటా శ్రీనివాసరావు మెగాస్టార్ చిరంజీవి ద్వారా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఒప్పించేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారని స్థానిక నేతలు అంటున్నారు. ఈ విధంగా తమ ప్లాన్ పకడ్బందిగా అమలు చేసి తెలుగుదేశం పార్టీ పై ‘‘మైండ్ గేమ్’’ ఆడాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నదని అంటున్నారు.

Related posts

అత్యాచారయత్నం కేసులో నిందితుడికి 5 ఏల్ల జైలు శిక్ష

Bhavani

ఆర్సీబీ జట్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ రాజీనామా

Sub Editor

అశోక్ గజపతి రాజు రూపంలో జగన్ కు మరో షాక్

Satyam NEWS

Leave a Comment