27.7 C
Hyderabad
March 29, 2024 04: 05 AM
Slider ముఖ్యంశాలు

హోల్డాన్: వైసీపీ లీడర్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు

ramesh kumar

అనంతపురం జిల్లా తాడిపత్రి శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ని  ఒక రోజు ప్రచారానికి దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో మార్చి 8 వతేదీన స్థానిక శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి మునిసిపాలిటీ పరిధిలో చీరలు, బట్టలు పంచిపెట్టినట్లు ఫీర్యాదు వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ తెలిపారు.

ఈ సంఘటన పై ఎన్నికల సాధారణ పరిశీలకులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తాడిపత్రి మునిసిపాలిటీ లోని శ్రీరాముల పేటలో వాకబు చేసి, వాస్తవాలను నిర్ధారించామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి రాష్ట్రంలో 7వ తేది నుండి అమల్లోకి వచ్చినందున, ఓటర్లు ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేయడం తీవ్రంగా పరిగణించామని అన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘన కింద ప్రాసిక్యూషన్ చేస్తామని తెలిపారు. శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి మార్చి 15 న ఒక రోజు  ఎన్నికల ప్రచారం లో పాల్గొనకుడదని ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

Related posts

నందమూరి తారక రామారావు అంటేనే ఒక స్ఫూర్తి

Satyam NEWS

సీఎంను కలసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు

Bhavani

మునిసిపల్ ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్

Satyam NEWS

Leave a Comment