39.2 C
Hyderabad
April 25, 2024 18: 00 PM
Slider ప్రత్యేకం

ఆనందయ్య మందు అమ్ముకోవడానికి వైసీపీ నేతల భారీ కుట్ర

#somireddychandramohanreddy

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు కు సంబంధించి నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పన్నిన భారీ కుట్రను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బట్టబయలు చేశారు.

నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియాకు కీలక విషయాలను ఆయన ఆధారాలతో సహా వెల్లడించారు. ఆనందయ్య మందు అమ్మకం పేరుతో బయటకు వచ్చిన childeal.in వెబ్ సైట్ ను తయారుచేసింది నెల్లూరుకు చెందిన సెశ్రిత(SESRITHA) కంపెనీ అని చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.

కృష్ణపట్నంలో మే 21వ తేదీన ఎమ్మెల్యే కాకాణి మందు పంపిణీ చేపట్టారని, అదే రోజు సెశ్రిత టెక్నాలజీ ఇండియా ప్రై లిమిటెడ్ గోడాడీ కంపెనీ వద్ద డొమైన్ కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. సెశ్రిత కంపెనీ నిర్వాహకులు కాకాణికి, అధికార పార్టీకి అత్యంత సన్నిహితమైన వారని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

హైకోర్టు మందు పంపిణీకి అనుమతించిన 31వ తేదీనే ఆన్ లైన్ లో మందు పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభించామని కాకాణి ప్రకటించారని ఆయన తెలిపారు.

జూన్ 2వ తేదీ ఉదయం 11 గంటల తర్వాత ఆన్ లైన్ లో chiledeal.in వెబ్ సైట్ కనిపించిందని ఆయన తెలిపారు. వెబ్ సైట్ హోమ్ పేజీ ఫ్యాన్ గుర్తు  సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, కాకాణి ఫొటోలు, వైసీపీ రంగులతో ఉందని ఆయన వివరించారు.

ఆయుర్వేదం మందు ఒక్కో ప్యాకెట్ రూ.167కి అమ్ముకునేందుకు పన్నాగం పన్నారని, అయితే దీన్ని ఆనందయ్య కుటుంబం ప్రశ్నించడంతో ప్లాన్ కు విఘాతం కలిగిందని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కథ అడ్డం తిరిగందని భావించి వెబ్ సైట్ ను హడావుడిగా పక్కనపెట్టారని ఆయన అన్నారు.

అప్పటి వరకు మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని హడావుడి చేసిన కాకాణి ఒక్క సారిగా ప్లేటు ఫిరాయించారని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఆనందయ్య మందుకు తమకు, తమ పార్టీకి సంబంధం లేదని హడావుడిగా ప్రకటన చేశారని ఆయన అన్నారు.

లేదంటే వందల కోట్లు దోచుకునేందుకు భారీ స్కెచ్ వేశారని చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.

సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశిం సునీల్ కుమార్, నెల్లూరు సిటీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెడ్ శివప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

సైకో పాలన అంతమొందిద్దాం

Satyam NEWS

కరోనా వేళ…నిబంధనల మధ్య ఆది శంకరుల జయంతి

Satyam NEWS

మంత్రి పువ్వాడ వాహనo తనిఖీ

Satyam NEWS

Leave a Comment