గత వైఎస్సార్పీపీ ప్రభుత్వ హాయంలో రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని ఇరవై సూత్రాల పథకం చైర్మన్ లంక దినకర్ అసహనం వ్యక్తం చేసారు. విజయనగరం జిల్లాకలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఇరవై సూత్రాల పథకం పై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి చైర్మన్ మాట్లాడుతూ గడచిన అయిదేళ్లలో రాస్ట్రానికి అన్ని రంగాలలో తీవ్రమైన నష్టమే జరిగిందని ఏ ఒక్క ప్రాజెక్టు గాని, పథకం గాని పరిపూర్ణంగా అమలు కాలేదన్నారు.
గతంలో జరిగిన పనులు,చేసిన కార్యచరణపై దృష్టి పెట్టకుండా ప్రస్తుత ప్రభుత్వంలో పని చేస్తున్న మీరంతా పథకాలు సక్రమంగా అమలయ్యేలా దృష్టి పెట్టాలని జిల్లా అధికారులనుద్దేశించి మాట్లాడారు ఇరవై సూత్రాల పథకాల చైర్మన్ లంక దినకర్.ప్రధానంగా సాగు నీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందని…కేంద్ర ప్రభుత్వం నిధులువిడుదల చేసినా..వాటిని గత ప్రభుత్వం దారిమళ్లించిందన్నారు. కాని ప్రస్తుతం మోడీ సర్కార్ ఏపీకి 95 వేల కోట్ల మంజూరు చేసారని ఈ పరిస్థితుల్లో అధికారులు సక్రమంగా ఆ నిధులను వినియోగించేలా చర్యలు చేపట్టాలని ఇరవై సూత్రాలపథకం చైర్మన్ లంక దినకర్ సూచించారు.
జల జీవన్ మిషన్ పథకంలో జిల్లాకు అన్యాయం
ఏపీ లో ఇరవై సూత్రాల పధకం చైర్మన్ లంక దినకర్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో విజయనగరం జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు , ప్రాజెక్టుల అమలు పురోగతి పైన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది.ఈ సమీక్ష సమావేశానికి కూటమి ఎమ్మెల్యేలు,టీడీపీకి చెందిన విజయనగరం ఆదితీ గజపతిరాజు, జనసేన పార్టీకి చెందిన నెల్లిమర్లకు చెందిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవిలు హాజరయ్యారు.
ఇక ఇరవై సూత్రాల పథకం అములో భాగంగా జిల్లాలో జంఘావతి,వంశధార,రామతీర్ధ సాగర్ నీటి పారుదల ప్రాజెక్టులపై సుదీర్ణంగా చర్చ జరిగింది.అలాగే తాటిపూడి జలాశయంపైన కూడా చర్చ జరగగా దీనిపై విజయనగరం ఎమ్మెల్యే ఆదితీ గజపతిరాజు మాట్లాడుతూ తాటిపూడి జలాశయం నుంచీ పొరుగు జిల్లా విశాఖకు నీటిని తరలించకుండా జిల్లాకే చెందాలని సూచించారు.అలాగే చంపావతి నది నీటిని కూడా జిల్లాకే ముందు ఇక్కడి సాగునీటికే వినియోగించేలా కార్యచరణ ఉండాలని ఎమ్మెల్యే ఆదితీ సూచించారు.