మంత్రిపదవులని మరోకటని తనపై ఒత్తిడి తెస్తే తానూ రాజీనామా చేస్తాననని కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. తనకు సహకరించి మూడేళ్ల పదవీకాలం విజయవంతం అయ్యేలా చూడాలని లేదంటే తాను రాజీనామా చేసేందుకు సిద్దమని చెప్పిన యడియూరప్ప,పదవి పోవడం, అధికారం రావడం తనకు కొత్త కాదనివారిని హెచ్చరించారు.
లింగాయత్ సామాజికవర్గానికి చెందిన స్వామీజీగా బీజేపీ ఎమ్మెల్యే మురుగేష్ నిరానీ కేబినెట్‌లోకి తీసుకోవాలని లేదంటే లింగాయత్ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందని కోరడం తో ఆయన ఈమాటన్నారు. హరిహర్‌లో జరిగిన లింగాయత్ సామాజిక వర్గపు సమావేశంలో సీఎం యడియూరప్ప పాల్గొన్నారు. ఈ సభలో వేల మంది లింగాయత్‌లను ఉద్దేశించి స్వామి వచానంద్ ప్రసంగించారు.
ఆ సమయంలో మురుగేష్ నిరానీ కష్టకాలంలో సీఎం యడియూరప్ప వెంట నిలిచారని ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకోకపోతే లింగాయత్‌ల మద్దతు బిజెపి కి ఇకపై ఉండబోదని చెప్పడం తో యెడ్యూరప్ప కు నషాళానికి అంటింది.యడియూరప్ప ఇలా అయితే తాను ఏమీ చేయలేనని రాజీనామా చేస్తానని చెప్పారు. తనను బెదిరించండం సరికాదని వెల్లడించారు.లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నేత హోంమంత్రి బస్వరాజ్ బొమ్మాయ్ కూడా సీఎం యడియూరప్పకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
తనకు సహకరించి మూడేళ్ల పదవీకాలం విజయవంతం అయ్యేలా చూడాలని లేదంటే తాను రాజీనామా చేసేందుకు సిద్దమని చెప్పిన యడియూరప్ప అధికారం తనకు కొత్త కాదనివారిని హెచ్చరించారు.ఇక కేబినెట్ విస్తరణ చేయాల్సిందిగా యడియూరప్పపై ఒత్తిడి వస్తోంది. అయితే ఇందుకు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.
మరోవైపు జనవరి 18 బీజేపీ జాతీయాధ్యక్షుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగళూరుకు రానుండటం తో కేబినెట్ విస్తరణపై చర్చిస్తామని యడియూరప్ప చెప్పారు.కాంగ్రెస్ జేడీయూల నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న 11 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తానని యడియూరప్ప ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే యడియూరప్ప తమకు తండ్రిలాంటి వాడని మురుగేష్ చెప్పారు. యడియూరప్ప ఏది చెప్పిన తమ మంచికోసమే అని చెప్పిన మురుగేష్ బీజేపీ సర్కార్ మూడేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంటుందనిఆశాభావం వ్యక్తం చేశారు.