30.2 C
Hyderabad
September 28, 2023 13: 53 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

కర్నాటకలో కొలువుదీరిన యడ్యూరప్ప మంత్రులు

yadurappa

జూలై 26 నుంచి వన్ మెన్ క్యాబినెట్ నడుపుతున్న కర్నాటక ముఖ్యమంత్రి బి ఎస్ యడ్యూరప్ప నేడు 17 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వరదలు తదితర కారణాల వల్ల మంత్రి వర్గం ఏర్పాటు చేయలేదని పైకి చెబుతున్నా కేంద్ర పార్టీ నుంచి క్లియరెన్సు లేకపోవడం వల్లే ఈ జాప్యం జరిగిందనేది బహిరంగ రహస్యం. గత మైత్రి ప్రభుత్వాన్ని వీడి బిజేపికి మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి హెచ్ నగేశ్‌కు కేబినెట్ లో బెర్త్ ను యడ్యూరప్ప ఖరారు చేశారు. 17 మంది కొత్త మంత్రులలో ఎక్కువ మంది లింగాయత్ లే ఉండటం గమనార్హం. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానం వత్తిడి తీసుకురావడం వల్ల ఐదుగురు కొత్త వారికి మంత్రి వర్గంలో స్థానం దక్కింది. మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న వారిలో గోవింద్ కర్జాల్, కె ఎస్ ఈశ్వరప్ప, ఆర్ అశోక్, డాక్టర్ సి ఎన్ అశ్వంత్ నారాయణ్, లక్ష్మన్ సవేదీ, జగదీష్ షెట్టర్, బి.రాములు, ఎస్ సురేష్ కుమార్, వి.సోమన్న, సి టి రవి, బస్వరాజ్ బొమ్మయ్, కోట నివాస్ పూజారి, జెసి మధుస్వామి, సి సి పాటిల్, ప్రభు చౌహాన్, శశికళా జోల్లే వీరంతా బిజెపి కి చెందిన వారు కాగా హెచ్ నగేష్ స్వతంత్ర ఎం ఎల్ ఏ కావడం గమనార్హం. సవేదీ, సి సి పాటిల్ యడ్యూరప్ప గత మంత్రి వర్గంలో కూడా సభ్యులు. విధాన సభలో బూతు బొమ్మలు చూసినందుకు వీరిద్దరూ అప్పటిలో రాజీనామాలు చేశారు.

Related posts

దక్షిణాది నుంచి రాజ్యసభకు ఎక్కువ ప్రాధాన్యం

Satyam NEWS

సిఏఏ నిబంధనల రూపకల్పనలో మరింత జాప్యం

Satyam NEWS

భూ వివాదంలో దాడికి గురైన దళితుల్ని పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకెళ్లారు?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!