34.2 C
Hyderabad
April 19, 2024 20: 59 PM
Slider నిజామాబాద్

ఫథలాపూర్ గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

Yellowgram purchage center

బిచ్కుంద మండలంలోని ఫథలాపూర్ గ్రామంలో గురువారం శనగ  విత్తనాల కొనుగోలు కేంద్రంను సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు తమ శనగలను కొనుగోలు కేంద్రాల ద్వారానే అమ్ముకోవాలన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద మాస్కులు ధరించి రావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద  చేతులు కడుక్కోడానికి సబ్బులు  నీటిని ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ఒకరి అమ్మకం తర్వాత మరొకరు రైతులు వస్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమని తాము కాపాడుకోవచ్చన్నారు.

ప్రతి ఒక్కరూ ఇంట్లో వద్దనే ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు వైస్ చైర్మన్ యాదవరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, సొసైటీ సిఇవో శ్రావణ్ కుమార్ సర్పంచ్ అరుణ్ కుమార్ గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related posts

క్రీడలతోనే శరీరం దృఢంగా తయారవుతుంది

Satyam NEWS

మంగళగిరిలో సమర్ధవంతంగా విజిబుల్ పోలీస్

Satyam NEWS

క్యాన్సర్ నిరోధక మందులపై పరిశోధనకు కొల్లాపూర్ యువకుడి కి డాక్టరేట్

Satyam NEWS

Leave a Comment