36.2 C
Hyderabad
April 25, 2024 20: 11 PM
Slider విజయనగరం

అందుబాటులోకి యాస్ తుఫాను కంట్రోల్ రూమ్

#toophan

యాస్ తుఫాను నేప‌థ్యంలో త‌గిన స‌మాచారం, స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేసేందుకు క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు జిల్లాలోని ప‌లు చోట్ల కంట్రోల్ రూమ్‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గ‌ణ‌ప‌తిరావు తెలిపారు.

ఈ మేర‌కు క‌లెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా క‌మాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆయ‌న‌ ప్రారంభించి సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పాటు విజ‌య‌న‌గ‌రం ఆర్డీవో కార్యాల‌యంలో, మ‌త్స్య‌శాఖ విభాగంలో, పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్ రం కార్యాలయంలో డివిజ‌న్ స్థాయి కంట్రోల్ రూమ్‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు.

అలాగే తీర ప్రాంత మండ‌లాలైన భోగాపురం, పూస‌పాటిరేగ త‌హిసీల్దార్ కార్యాల‌యాల్లో కూడా కంట్రోల్ రూమ్‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని ఆయ‌న వివ‌రించారు. తుఫానుకు సంబంధించిన‌ సమాచారం కావాల్సిన వారు.. స‌హాయ స‌హ‌కారాలు అవ‌స‌ర‌మైన వారు ఈ కింద పేర్కొన్ననెంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని సూచిస్తూ కంట్రోల్ రూమ్‌ల నెంబ‌ర్ల‌ను వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌రేట్ ఏవో దేవ్ ప్ర‌సాద్‌, డి-సెక్ష‌న్ సూప‌రింటెండెంట్ శ్రీ‌కాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కంట్రోల్ రూమ్ నెంబ‌ర్లు కింది విధంగా అందుబాటులోకి తెచ్చింది…జిల్లా యంత్రాంగం..

జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం –  08922 236947

విజ‌య‌న‌గ‌రం, ఆర్డీవో కార్యాల‌యం – 98853 67237

పార్వ‌తీపురం, స‌బ్ కలెక్ట‌ర్ కార్యాల‌యం – 08963 222236

విజ‌య‌న‌గ‌రం, మ‌త్స్య‌శాఖ కార్యాల‌యం – 08922 273812

భోగాపురం, త‌హసీల్దార్ కార్యాల‌యం -80744 00947

పూసపాటిరేగ‌, త‌హ‌సీల్దార్ కార్యాల‌యం  – 70367 63036

Related posts

కరెంట్ ఛార్జీల పెంపుదలపై కాంగ్రెస్ నిరసన కార్యక్రమం

Satyam NEWS

రేషన్ షాపులు ఆకస్మిక తనిఖి

Murali Krishna

బీసీసీఐ కు షాకిచ్చిన ఆఫ్గాన్ తాలిబాన్లు

Sub Editor

Leave a Comment