33.2 C
Hyderabad
April 26, 2024 01: 28 AM
Slider నెల్లూరు

దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోండి

#yoga day nellore

అంతర్జాతీయ యోగా  దినోత్సవం సందర్భంగా నెల్లూరు లోని వి యస్ యు జాతీయ సేవా పథకం, నెహ్రు యువ కేంద్రం సంయుక్తంగా ఆన్ లైన్ వర్కుషాప్, సామూహిక యోగా ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి  వి ఎస్ యు ఉపకులపతి బి రాజశేఖర్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.

వర్కుషాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ యోగ మనకు సనాతన ధర్మం ఇచ్చిన మంచి కానుకగా అభివర్ణించారు. అలాగే యోగ మన భారత దేశం, ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప   బహుమతి అని అన్నారు.

పేద వాడైనా, ధనికుడైన, ధృఢంగా, ఆరోగ్యంగా ఉండడానికి యోగా అనేది అతి చౌకైన, సులభమైన. ఉత్తమమైన సాధనమని అన్నారు.

ముఖ్యంగా కొరోనా మహమ్మారి ఉదృతంగా ప్రబలుతున్న సమయం లో యోగా, ధ్యానం ద్వారా మనలను కాపాడుకోవచ్చునని అన్నారు.

విశ్వవిద్యాలయ ప్రతి సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు  దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోమని కోరారు.  జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ యోగా అధ్యాపకురాలు డా. డి. జ్యోతి కొరోనా మహమ్మారి సమయంలో యోగా అభ్యాసాల విశిష్టతను విపులంగా వివరించారు.

తదనంతరం యోగ గురు స్వప్న జవారి కపీశ యోగ ప్రోటోకాల్లో నిర్దేశించిన వివిధ యోగాసనాలను చక్కగా అందరికి ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య యం చంద్రయ్య, రిజిస్ట్రార్ డా. ఎల్ విజయ కృష్ణా రెడ్డి, ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, కార్యనిర్వాహకులు, ఎన్ యస్ యస్ సమన్వయకర్త డా.ఉదయ్ శంకర్ అల్లం, నెహ్రు యువ కేంద్ర యూత్ ఆఫీసర్ డా. ఏ మహింద్ర రెడ్డి, ఎన్ యస్ యస్ విశ్వవిద్యాలయ సలహా మండలి సభ్యులు డా. కె సునీత, డా. కిరణ్మయి,అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది 300 మంది వివిధ కళాశాల ప్రోగ్రాం అధికారులు వాలంటీర్లు పాల్గొన్నారు.

Related posts

తండ్రి కుమార్తెను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Satyam NEWS

జిల్లా విద్యా వైజ్ఞానిక సదస్సును జయప్రదం చేయాలి

Bhavani

పేకాట‌రాయుళ్ల‌పై దాడులు భారీగా ప‌ట్టుబడ్డ న‌‌‌గ‌దు

Sub Editor

1 comment

Embeti . Anusha June 22, 2021 at 8:46 PM

Very good and useful news

Reply

Leave a Comment