28.7 C
Hyderabad
April 20, 2024 09: 04 AM
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ ద్వారానే నిరుద్యోలకు న్యాయం జరుగుతుంది

#congress

ఐదు శీర్షికల ద్వారా కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారని. టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండి. అజీజ్ పాషా పత్రికలకు విడుదల చేసిన సమావేశ ప్రకటనలలో అన్నారు. యువ మహిళా సాధికారత కోసం ఎలక్ట్రిక్‌ స్కూటీలు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని అన్నారు.

అమరవీరుల ఉద్యమ కారులకు గుర్తుగా తొలి డిక్లరేషన్ అని అజీజ్ పాషా తెలిపారు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని,వారి కుటుంబాలకు 25,000 రూపాయల పింఛన్ తో పాటు అమరవీరులకు సముచిత గుర్తింపు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని వివరించారని,రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లో నిర్వహించిన కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ ప్రకటన చేశారని అజీజ్ పాషా హర్షం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ పోస్టులతో పాటు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఏటా జూన్‌ 2న, జాబ్‌ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు అజిజ్ పాషా తెలిపారు. సెప్టెంబర్‌ 17న, నియామక పత్రాలు లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ప్రతి నెలా 4,000 వేల నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు  వెల్లడించారు.

సెంట్రలైజ్డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని,రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాగానే కమిషన్ ను బలోపేతం చేస్తామని తెలిపారు.యూపీఎస్సీ మాదిరిగా చేసి పారదర్శకంగా పోస్టుల భర్తీ చేస్తామని వివరించారు.సెంట్రలైజ్డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానం తీసుకువస్తామని చెప్పారు.ఏడు జోన్లలో ఎంప్లాయ్‌మెంట్‌,నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

10 లక్షల వరకు వడ్డీ లేని ఋణం, ప్రైవేట్ పరిశ్రమల్లో 75 శాతం స్థానిక యువతకే ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని,ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తీసుకువస్తామని పేర్కొన్నారు. విద్య,ఉపాధి సమస్యలపై యూత్‌ కమిషన్‌ ఏర్పాటు చేయనుట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని ఋణాలు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నదని తెలిపారు. గల్ఫ్‌ కార్మికులను ఆదుకునేందుకు చట్టం తీసుకువస్తామని అన్నారు. మోసం చేసే ఏజెంట్లను నియంత్రిస్తామని, గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలను ప్రత్యేక సంస్థ ద్వారా భర్తీ చేస్తామని,విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌, పాత బకాయిలను చెల్లిస్తామని ఎండి అజీజ్ పాషా అన్నారు. ఆదిలాబాద్‌,మెదక్‌,ఖమ్మంలో వర్సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. బాసర వర్సిటీ తరహాలో 4 ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటుతో పాటుగా స్పోర్ట్స్‌ అకాడమీని ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు చేయూత అందించనున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే పోలీసులు,ఆర్టీసీ కార్మికుల పిల్లలకు వరంగల్‌,హైదరాబాద్‌లో 2 వర్సిటీలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్యను పూర్తిగా అందిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల మల్లయ్య, కోల మట్టయ్య, సమ్మెట సుబ్బరాజు, ముషం సత్యనారాయణ, జగన్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

విజ‌య‌న‌గ‌రం నుంచీ విదేశాల వ‌ర‌కు ఖండాల్లో తెలుగు ఖ్యాతిని చాటిన మ‌హిళ‌…!

Satyam NEWS

వనపర్తి మున్సిపాలిటి అవినీతి ఆక్రమాలపై కలెక్టర్ కు పిర్యాదు 

Satyam NEWS

శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ బ్రాహ్మణ సత్రంలో వసంత పంచమి

Satyam NEWS

Leave a Comment