31.7 C
Hyderabad
April 25, 2024 02: 20 AM
Slider ఆదిలాబాద్

నిరుపేదలకు సాయం చేస్తామంటున్న యువకులు

Penchikalpet youth

కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో నిరుపేదలకు, కరోనా లాక్ డౌన్ కారణంగా రోజువారి పని చేసుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారికి మండలం లోని యువకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

పేద ప్రజలు ఇంకా ఎవరైనా ఉంటే వారికి మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని వారు అంటున్నారు. ఆకలితో ఎవరు బాధపడకూడదని సదుద్దేశంతో ఈ పంపిణీ చేస్తున్నామని వారు తెలిపారు. తమకు తోడుగా ఇంకెవరైనా సహాయ సహకారాలు అందిస్తే మండలంలోని అన్ని గ్రామాల పేదలకు కూడా నిత్యావసర సరకులు పంపిణీ చేస్తామని చెప్పారు.

ప్రజలు సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ లు వాడాలని ఎవరికైనా దగ్గు జ్వరం ఉంటే మండలంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే సర్పంచ్ లేదా వీఆర్వో కు తెలియజేయాలని కోరారు.

అత్యవసర పరిస్థితి లేకుండానే ప్రజల రోడ్లపై రాకూడదని అది మనందరికి ముప్పని తెలియజేశారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వారిలో రావుల సంతోష్, పెద్ది హరికృష్ణ, తెలుగే రమేష్, మాజిద్, ప్రసాద్, నాగరాజు ఉన్నారు.

Related posts

సమైక్య భారతం కోసం ప్రాణాలను త్యజించిన శ్యామాప్రసాద్ ముఖర్జీ

Satyam NEWS

అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ ప్రతిభ చాటిన అభిగ్యాన్

Satyam NEWS

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాలికపై అత్యాచారం

Satyam NEWS

Leave a Comment