34.2 C
Hyderabad
April 23, 2024 13: 52 PM
Slider పశ్చిమగోదావరి

వరుసగా మూడవ ఏడాది వైఎస్సార్‌ ఆసరా…!

#ysrasara

దెందులూరు నుంచీ బటన్ నొక్కి ప్రారంభించిన సీఎం జగన్…!

“వైఎస్సార్‌ ఆసరా” పథకం ద్వారా మూడో విడత  6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇవాళ్టి నుంచీ ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్నీ  ఏలూరు జిల్లా దెందులూరులో  సీఎం వై.ఎస్. జగన్ ప్రారంభించారు. నేడు అందిస్తున్న 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్‌ ఆసరా కింద ఇప్పటివరకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం  19,178 కోట్లు అని సీఎం వై.ఎస్. జగన్ చెప్పారు.చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాలకు… మేనిఫెస్టోలో ఇచ్చిన మాట మేము నెరవేర్చామని చెప్పారు.

గత ప్రభుత్వ రుణాలు కట్టొద్దు పొదుపు సంఘాల తరపున మేమే చెల్లిస్తామని 2014లో హామీ ఇచ్చి ఎగ్గొట్టిన కారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా చితికిపోయిన దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 78.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఊరటనిస్తూ.. 2019 ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ తుది జాబితా ప్రకారం ఉన్న రూ. 25,571 కోట్ల రుణాన్ని తామే చెల్లిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, ఇప్పటికే 2 విడతల్లో  12,758 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించామని సీఎం జగన్ తెలిపారు.కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి  ప్రభుత్వం అందించిన సహకారంతో ఇప్పటి వరకు 9,86,616 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం తదితర వ్యాపారాలు చేపట్టి నెలకు 7,000 నుండి  10,000ల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారని, అలానే అమూల్ తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై 5 నుండి 15 వరకు అదనపు ఆదాయం సంపాదిస్తున్నారని  సీఎం జగన్ అన్నారు.

అందిస్తున్న సంక్షేమ పథకాలలో ఎక్కడ కూడా లంచాలు లేవని, వివక్ష లేదని సీఎం జగన్ అన్నారు. స్వయం ఉపాధి పొందాలనుకుంటే ప్రభుత్వం పరంగా మహిళలకు తోడ్పాటు.. సలహాలు ఇస్తూ, అండగా ప్రభుత్వం నిలబడుతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 9 లక్షల మందికి  అక్క చెల్లెమ్మలకు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు వారికీ రూ.4355 కోట్లు బ్యాంకుల ద్వారా  అనుసంధానం చేశామని సీఎం జగన్ తెలిపారు.

దేశానికి రోల్‌మోడల్‌గా ఏపీ పొందుపు సంఘాలు నిలుస్తున్నాయని.. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించాం అని సీఎం జగన్ అన్నారు. ఇంకా తగ్గించేలా బ్యాంకర్లమీద ఒత్తిడి తీసుకువస్తున్నామని అయన తెలిపారు. “ఈ 45 నెలల కాలంలో మీ తమ్ముడి ప్రభుత్వం… మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ 2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సహాయం అందించాము,” అని తెలిపారు సీఎం జగన్.మహిళ వివక్షమీద పోరాటం చేస్తోంది ఈప్రభుత్వం. కోట్లమంది అక్కచెల్లెమ్మలు.. రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనది.  ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి, కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది. గుడి ఛైర్మన్‌, ఏంఎసీ.. ఇలా నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. అక్క చెల్లెమ్మలకు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతో దిశ యాప్‌ను తీసుకు వచ్చాం. 1.17 లక్షల మంది రిజస్టర్‌ చేసుకున్నారు. 21 శతాబ్దపు ఆధునిక మహిళ మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రావాలని తపనపడుతున్నాను, అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

Related posts

ముగిసిన వారం రోజుల ఏఐసిటిఈ – ఐడియా అధ్యాపకుల శిక్షణ

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో సజావుగా నవోదయ ప్రవేశ పరీక్ష

Satyam NEWS

పాముల పండుగ

Satyam NEWS

Leave a Comment