31.2 C
Hyderabad
April 19, 2024 05: 40 AM
Slider ముఖ్యంశాలు

ఉత్త‌రాంధ్ర‌లోనే సామాజిక న్యాయంలేదంటోంది..మ‌రి టీడీపీ ఏం చేసింది…?

#mpsrinivasarao

బీసీల‌ను అస‌లు తుంగలోకి నెట్టిందే…టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అని విజ‌య‌న‌గ‌రం జిల్లా వైఎస్ఆర్సీపీ  జిల్లా  అధ్య‌క్షుడు,జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస‌రావు ధ్వ‌జ‌మెత్తారు. అస‌లు బీసీల‌కు ప్రాధాన్య‌త ఇచ్చిందే మా పార్టీ అధినేత‌,సీఎం జ‌గ‌న్ అని జేడ్పీ చైర్మ‌న్ నొక్కి చెప్పారు.

ఉత్త‌రాంద్ర‌లో ఏ ఒక్క బీసీకి నేత‌కు నాడు టీడీపీ ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇచ్చిందా అంటూ ప్ర‌శ్నించారు. కేవ‌లం..ఉత్త‌రాంధ్ర‌లో అదీ విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఒకే ఒక్క మ‌హిళ‌కు  ఆ పార్టీ ప్రాధాన్య‌త ఇచ్చిందన్నారు.త‌మ ప్ర‌భుత్వం…రాష్ట్ర  వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ,ద‌ళితీ, బీసీ ,మైనార్టీ వ‌ర్గాల‌కు అధిక ప్రాధాన్య‌త ఇచ్చి.. 17మందికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం…అలాగే  నామినేటెడ్ పోస్టులు ఇచ్చి….సామాజిక న్యాయం  చేసార‌ని జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌ర్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్య‌క్షుడు స్ప‌ష్టం చేసారు. 

గ‌తంలో కేంద్ర మంత్రి హోదాలో ఉన్న విజ‌య‌న‌గ‌రంకు చెందిన  ఆ పార్టీ నేత ఏ వ‌ర్గానికిచెందిన వారో  ప్ర‌తీ ఒక్క‌రికి తెలుసున‌ని జేడ్పీ చైర్మ‌న్  ఎద్దేవా చేసారు. మొద‌ట్లో టీడీపీ ప్ర‌భుత్వం హయాంలో బీసీ మ‌హిళ‌కు అదే చీపురుపల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచీ  సీటు కేటాయించారు….కానీ కొంత‌కాలం త‌ర్వాత‌…బొబ్బిలికి ఇచ్చారు..మ‌రీ మీరు ఏ విదంగా బీసీల‌కు ప్రాధౄన్య‌త ఇచ్చారో..విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతో్ంద‌న్నారు.

ఉత్త‌రాంద్ర‌లో 70 శాతం  బీసీ వ‌ర్గాల వారే ఉన్నా…మేమెవ్వ‌ర‌మూ   మీ దృష్టిలో అర్హుల‌ము కామ‌నే ఉద్దేశ్యంతో క్ష‌త్రియుల కులానికిప్రాదానత ఇచ్చార‌ని చెప్పారు…వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్య‌క్షుడు,కానీ…త‌మ ప్ర‌భుత్వం..మా సీఎం జ‌గ‌న్…న‌వర‌త్రాల పేరుతో…బీసీవ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ రాజ్యాధికారం క‌ల్పిస్తూ ఎన్నో చ‌ర్య‌లు తీసుకున్నార‌ని..అది చూసి టీడీపీ ఓర్వ‌లేక‌పోతోంద‌ని విమ‌ర్శించారు.

16 మంది మంత్రుల రాకతో పులకరించిన ప్రకృతి

మంత్రి బొత్స నేతృత్వంలో జిల్లాలోనే తొలిసారిగా ఒకేసారి 16 మంది బీసీ వ‌ర్గానికి చెందిన మంత్రులు రావ‌డం…అందుకు ప్ర‌కృతి కూడా కరుణించింద‌ని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్య‌క్షుడు, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస‌రావు అన్నారు. 

అప్ప‌టిదాక‌..42 డిగ్రీల ఉష్టోగ్ర‌త‌తో ఉన్న విజ‌య‌న‌గ‌రం ఒక్కసారి చ‌ల్ల‌బ‌డి..వ‌ర్షం కురవ‌డంతో ప్ర‌కృతి కూడా  కరుణించిందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్య‌క్షుడు అన్నారు.. శ్రీకాకుళంలో 16 మంది బీసీ వర్గానికి చెందిన మంత్రులో  సామాజిక న్యాయ భేరీ  బస్సు యాత్ర ప్రారంభ‌మైంద‌ని…జిల్లాలోని పూస‌పాటిరేగ మండ‌లం కంది వ‌ల‌స వ‌ద్ద‌…ఆ బ‌స్సు యాత్ర‌కు…జిల్లా వైఎస్ఆర్సీపీ స్వాగ‌తం ప‌లికి…స‌భను విజ‌య‌వంతంగా నిర్విహించామ‌న్నారు.

అక్క‌డ నుంచీ కుమిలి,జ‌మ్ము, అలాగే విజ‌య‌న‌గ‌రంలో  ఆ ప‌ద‌హారు మంది మంత్రుల‌తో బ‌హిరంగ స‌భ  నిర్వ‌హించ ద‌లిచామ‌ని..కానీ వ‌ర్షం కారణంగా  ఆప‌దిహేడు మంది మంత్రులెవ్వ‌రూ మాట్లాడ‌లేక‌పోయార‌ని జేడ్పీ చైర్మ‌ర్, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్య‌క్షుడు మజ్జి  శ్రీనివాస‌రావు(చిన్న శీను) అన్నారు.  కానీ జిల్లాలో బ‌స్ యాత్ర ప్ర‌వేశంచిన వ‌ద్ద నుంచీ అంటే కుమిలి ద‌గ్గ‌ర నుంచీ ప్ర‌కృతికూడా పుల‌క‌రించింద‌న్నారు.

ఇక జ‌మ్మూ వ‌ద్ద నుంచీ  పార్టీ కార్య‌కర్త‌లంతా బైక్ ర్యాలీగా వ‌జియ‌న‌గ‌రం వ‌ర‌కు వ‌చ్చార‌న్నారు.మాడు ప‌గిలే ఎండ‌లో సాయం సంధ్య వేళ‌లో న‌గ‌రంలోని న్యూపూర్ణ జంక్ష‌న్ వ‌ద్ద  పెట్టిన భారీ బ‌హిరంగ స‌భ కూడా…ఏర్పాట్ల‌లో విజ‌య‌వంతం అయ్యింద‌న్నారు. వేదిక‌పై ఒకేసారి 16 మంత్రులు రావ‌డడంతో వ‌రుణ‌దేవుడు కూడా పుల‌క‌రించిపోయాడ‌ని… అంత‌వ‌ర‌కు ఎండ‌వేడితో అల్లాడిపోతున్న న‌గ‌ర ప్ర‌జ‌కు వ‌ర్షం  ఉప‌శ‌మ‌నం కలిగించ‌డం…అందుకు..16 మంది బీసీ మంత్రులు సామాజిక న్యాయ  భేరీ తో వేదిక‌పైకి రావ‌డం ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని జేడ్పీ చైర్మ‌న్ అన్నారు. 

వ‌ర్షం ప‌డుతున్నా…ఆ మంత్రులంద‌రూ…వేదిక‌పై  అలాగే ఉండి…ప్రజ‌ల‌కు..అలాగే జిల్లా తో రాష్ట్రానికి మొత్తం… మేమంతా..ఒక్కటే…మంత్రులంతా…సీఎం జ‌గ‌న్ నే ప్రాదాన్య‌త  అంటూ ఉండటం..సామాజిక న్యాయ భేరీ విజ‌య‌వంతం అయ్యింద‌న‌టానికి ఓ నిద‌ర్శ‌ర‌మ‌ని అన్నారు.

Related posts

రిక్వెస్టు: పసుపు పంటకు 15వేలు మద్దతు ధర కావాలి

Satyam NEWS

9న కొప్పరపు కవుల కళాపీఠం మహాసభ

Satyam NEWS

నిర్మల్ ఫర్టిలైజేషన్ అసోసియేషన్ రూ.లక్ష విరాళం

Satyam NEWS

Leave a Comment