27.7 C
Hyderabad
April 24, 2024 09: 16 AM
Slider గుంటూరు

అరాచకమే ఆదర్శంగా రాష్ట్రంలో వైసీపీ పాలన

#TDP

ప్రశ్నించిన ప్రతి ఒక్కరి పై దాడులు, హత్యలు చేస్తూ అరాచకమే ఆదర్శంగా జగన్ తన పరిపాలనను కొనసాగిస్తున్నారని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు. పట్టణంలోని స్థానిక ప్రకాష్ నగర్ లో జరిగిన ప్రజా చైతన్య యాత్ర లో మాట్లాడుతూ బిసి,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల వారికి సంక్షేమ పథకాలు అందిస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారని జగన్ మాట్లాడటం సిగ్గుమాలిన చర్య అన్నారు. బిసి,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు కార్పొరేషన్ లోన్ లు ఎత్తి వేసింది జగన్ ప్రభుత్వం కాదా? అని డా౹౹చదలవాడ ప్రశ్నించారు.

బిసి కులాల వారికి ఆదరణ పథకం ద్వారా చేతి వృత్తుల కోసం చంద్రబాబు ఇచ్చే పరికరాలు, వాషింగ్ మిషన్లు ఇస్తే వాటిని రద్దు చేసింది జగన్ కాదా? అని అన్నారు. రజకులు,నాయి బ్రహ్మణులు, టైలర్ లు రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది ఉంటే జగన్ కేవలం 2.80 వేల మందికి మాత్రమే చేదోడు పథకం ఇచ్చి మోసం చేశారన్నారు. ఉద్యోగస్తులకు జగన్ చేస్తున్న అన్యాయం పై వారు రోడ్ ఎక్కి ఉద్యమం చేస్తే దానికి రాజకీయ రంగు పులుముతున్నారన్నారు.

ఉద్యోగస్తులు మాదిరే అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారు కూడా ఆరు నెలల్లో రోడ్డు ఎక్కుతారన్నారు. ఇళ్ళ స్థలాల పేరుతో నరసరావుపేట ఎమ్మెల్యే, వైసీపీ నాయకులతో భూములను రైతుల వద్ద తక్కువ రేటుకు కొనుగోలు చేసి వాటిని ప్రభుత్వానికి అధిక ధరకు అమ్మి కోట్లు దోచుకున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేల్పుల సింహాద్రి యాదవ్,పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్ బాబు,రొంపిచర్ల మండలం పార్టీ అధ్యక్షులు వెన్న బాలకోటి రెడ్డి,పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షులు రావెల లక్ష్మీనారాయణ,పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయ్ శ్రీ,విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధ్యక్షులు పూదోట సునీల్,పూదోట రాయన్న,కామినేని అమర్నాథ్,వార్డు అధ్యక్షులు గణేష్ దుర్గ,మన్నన్ షరీఫ్,బడే బాబు,మబు,పీటర్ రాజు,మీరవాలి,రాష్ట్ర రైతు నాయకులు కడియం కోటి సుబ్బారావు,మొండితోక రామారావు,కోనేటి శ్రీనివాస్ రావు, ఆర్టీసీ చంద్ర,శ్రీరామినేని ప్రసాద్,పెరికాల రాయప్ప,పూదోట వంశీ,సుభాని,ఖలీల్,బంగారం టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related posts

చెత్తను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలి

Satyam NEWS

దేశంలో పెరుగుతోన్న ఒమిక్రాన్‌ కేసులు

Sub Editor

200 కోట్ల అమ్మకాలు

Murali Krishna

Leave a Comment