39.2 C
Hyderabad
March 29, 2024 16: 29 PM
Slider నల్గొండ

గ్రామ గ్రామాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఎగుర వేద్దాం

#aderla

తెలంగాణలో వైయస్ షర్మిల నాయకత్వాన్ని బలపరిచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా గ్రామ గ్రామాన ఎగురవేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండలం మాదారం గ్రామంలో గురువారం బండారు వీరయ్య అధ్యక్షతన వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హుజూర్ నగర్ నియోజకవర్గ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇంచార్జ్ ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల సారధ్యంలో నిర్మితమైన వైయస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని,వైఎస్ షర్మిలను బలపరచి హుజూర్ నగర్ నియోజకవర్గం లోని గ్రామ గ్రామాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై నిరంతరం పాటుపడ్డారని,రైతుల పక్షపాతిగా తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే రైతు ఋణ మాఫీ పథకంపై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మందికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్  వైద్యాన్ని అందించారని,ఈ పథకం ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారని అన్నారు.

అనుక్షణం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలమ్మ రాజన్న ఆశయ సాధన కోసం మన అందరి బాగుకోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి మన ముందు నిలబడ్డారని వారికి మనం అందరం పూర్తి స్థాయిలో మద్దతు పలికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని బలోపేతం చేయాలని కోరారు.

అనంతరం వివిధ పార్టీలకు చెందిన 300 మంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో బండారు వీరబాబు, బండారు గౌతం,బండారు పాపయ్య, చడపంగు వెంకటేశ్వర్లు,బట్టు వెంకటేశ్వర్లు,చిలక వెంకయ్య,షేక్ హుస్సేన్,షేక్ జాని,బొంగరాల శ్రీకాంత్,బండారు శ్రీకాంత్,దాసరి వీరబాబు,దాసరి గోపి,దాసరి ప్రభాస్,చడపంగు మహేష్,బట్టు గోపి,సిద్దపంగు నరేష్,దాసరి సైదులు, అనుకుల వీరారెడ్డి పలువురు ముఖ్య నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

పెద్ద నోట్ల రద్దు పై ఆర్ బీ ఐ, కేంద్రానికి సుప్రీం నోటీసులు

Satyam NEWS

డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Murali Krishna

భవన నిర్మాణ సామాగ్రి ధరలకు అదుపు లేదా?

Satyam NEWS

Leave a Comment