27.7 C
Hyderabad
April 26, 2024 05: 00 AM
Slider చిత్తూరు

వైసీపీ వారు దాడి చేసినా కేసు లేదు.. నా వెంటపడతారేం

#yuvagalam

వైసీపీవారు 20 మంది రాళ్లు తీసుకొని దాడి చేయడానికి కత్తులు, రాళ్లతో సిద్ధంగా వున్నా.. కేసులు లేవు. లోకేశ్ మాత్రం స్టూల్ ఎక్కి మాట్లాడితే కేసులు పెడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పాపానాయుడుపేట లో యువగళం పాదయాత్రలో ఆయన ప్రసంగించారు.

గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి, జగన్, షర్మిల పాదయాత్ర చేశారు. మైక్ తీసేసుకోలేదు. అయితే నేడు నేను పాదయాత్ర చేస్తుంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇది న్యాయమేనా? ప్రజలు ఒకసారి ఆలోచించాలి అని ఆయన కోరారు. డిఎస్పీ డిస్ట్రబ్ చేశారు. ప్రసంగాన్ని అడ్డుకోవడం పద్ధతి కాదు. అడుగడుగునా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ధరలు విపరీతంగా పెరిగాయి. డిఎస్సీ నోటిఫికెషన్ ఎప్పుడు వేస్తారని ఒక చెల్లి అడగడం జరిగింది. మరో పక్క కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీ తరపున ప్రభుత్వంతో పోరాడడానికి నేనొచ్చాను. అధికారులు.. ప్రజలతో మాట్లాడనివ్వకుండా నా గొంతు నొక్కాలని చూస్తున్నారు. మైక్ పట్టుకొని మాట్లాడటంలేదుకదా?  మీ సమస్యలు తెలుసుకోవడానికి వస్తే చూడండి ఎలా బిహేవ్ చేస్తున్నారో?

ఎమిటీ ఈ అరాచకం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేస్తే కేసు లేదు. చంద్రబాబునాయుడు ఒక చిటికేసి చెబితే చాలు టీడీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్ల పని పడతారు. మాకు పౌరుషం లేదనుకోవద్దు.  రండి చూసుకుందాం. పోనీలెమ్మని ఓర్పు, సహనంతో ఉంటున్నాం. మా ఓర్పు, సహనాన్ని పరీక్షించకండి. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని కట్ డ్రాయిర్ పై ఊరేగిస్తాను.

దమ్ము, ధైర్యం ఉంటే నా వద్దకు రండి. ఇక్కడే నిలబడతాను. అంతేగానీ బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్లు విసిరితే మాకేమీ కాదు. మాట్లాడేందుకు మాకు హక్కు ఉంది. నేను సిద్దంగా ఉన్నాను. డీఎస్పీ మహా అయితే కేసు పెడతారు కదా పెట్టుకొండి. ఏ కేసు పెడతారో పెట్టుకొండి. తమాషాలాడకండి. మాట్లాడే హక్కు మాకుంది.  రేపొచ్చేది మా ప్రభుత్వమే. పోస్టింగులు ఇచ్చేది నేనే అని గుర్తు పెట్టుకోవాలి. 

పాలిచ్చే ఆవు వెళ్లి.. తన్నే దున్నపోతు వచ్చింది. అందరూ బాధపడుతున్నారు. ప్రజలకు అడుగడుగునా భాధలు తప్ప సుఖ సంతోషాలు లేవు. అన్నీ సమస్యలే. ఈ బాధలన్నీ పోవాలంటే బాబు రావాలి.  సౌండ్, మైక్ లాక్కున్నారు. స్టూల్ లాక్కున్నా తమ్ముడి భుజంపై ఎక్కి మాట్లాడుతాను. లేదంటే ఆ మిద్దె ఎక్కుతాను. ఈ గొంతు ఆగదు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీరామారావు నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చారు.

నా ఒంట్లో శక్తి  ఉన్నంతవరకు మీ తరపున పోరాడుతూనే ఉంటాను. కనీసం మైక్ ఇవ్వడానికి డీఎస్పీ భయపడుతున్నాడు. ఈ విషయాన్ని తల్లి, చెల్లి ఆలోచించాలి. దీన్ని బట్టి జగన్ ఎంత పిరికివాడో అర్థమౌతోంది. జగన్ మనిషైతే, రాయలసీమ పౌరుషం ఉంటే పోరాటానికి రమ్మని చెప్పండి. మైక్ ఇస్తాను మాట్లాడు ఏం మాట్లాడతావో మాట్లాడు అందుకు నేను సమాధానం చెప్తాననాలిగానీ మైక్ లాక్కోవడమేంటి?

ప్యాలెస్ పిల్లిలాగ దాక్కోవడమేంటి? ఇక్కడి బడాచోర్ (పెద్ద దొంగ) ఎమ్మెల్యే చేసేవన్నీ బయటికి రాబడతాను. ఇసుక దొంగలను బయటికి లాగుతాను. ఇసుక రీచ్ లో అక్రమంగా  ఇసుక తరలి వెళ్తున్నా కేసెందుకు పెట్టడంలేదని డీఎస్పీని ప్రశ్నిస్తున్నాను. దమ్ము, ధైర్యంతో నేను మీ కోసం నిలబడతాను. ఏం చేస్తారో చేసుకొండి. జగన్ సహకరిస్తే పాదయాత.. లేకుంటే దండయాత్ర అంటూ లోకేష్ హెచ్చరించారు.

Related posts

ఫెస్టివల్ గిఫ్ట్: జగనన్న రంజాన్ ఖదర్

Satyam NEWS

విశ్వవిఖ్యాత గాయకుడిని పిలిచి అవమానించిన ప్రధాని మోడీ

Satyam NEWS

రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ

Satyam NEWS

Leave a Comment