39.2 C
Hyderabad
April 23, 2024 16: 53 PM
Slider ప్రపంచం

భారత్ ముస్లింలు ఒక ప్రత్యేక పార్టీ పెట్టుకుంటే మేలు

#ZakeerNaik

భారత్ నుంచి పారిపోయి మలేషియాలో తలదాచుకుంటున్న ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ భారత్ లో ముస్లింలు అనుభవిస్తున్న కష్టాలపై సానుభూతి వ్యక్తం చేశాడు. గత ఆరు సంవత్సరాలుగా భారత్ లో ముస్లింలు అణచివేతకు గురి అవుతున్నారని జకీర్ నాయక్ అన్నాడు.

ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో ఒక వీడియోను అప్ లోడ్ చేశాడు. ఇస్లాంలోని వివిధ వర్గాలకు చెందినందున భారత్ లోని ముస్లింలు ఐక్యం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

అంతే కాకుండా భారత్ ముస్లింలు వివిధ పార్టీలలో ఉంటున్నారని అలా కాకుండా ముస్లింలు అందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకోవాలని ఆయన సూచించాడు.

ముస్లింలు మెజారిటీ ఉన్న దేశాలకు భారత్ ముస్లింలు వలస వెళ్లడం ఉత్తమమైన విధానమని లేకపోతే భారత్ లో అణచివేతకు గురి కావాల్సి వస్తుందని జకీర్ నాయక్ అన్నాడు.

Related posts

27న ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ ఆధ్వర్యంలో ఉచిత వెబినార్

Satyam NEWS

నిర్మల్ పట్టణంలో తడి పొడి చెత్త ఇక సపరేటు

Satyam NEWS

ఎల్డర్స్: కేకే, సురేశ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

Satyam NEWS

Leave a Comment