25.7 C
Hyderabad
June 22, 2024 05: 07 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్‌లో జక్‌ జ్యువెలరీ ఎక్స్‌పో ప్రారంభం

#zec jewelers

ప్రత్యేకమైన ఆభరణాల ప్రదర్శనగా ఖ్యాతి గడించిన జక్‌ జ్యువెల్స్‌ ఎక్స్‌పో మరోమారు హైదరాబాద్‌ నగరానికి తిరిగి వచ్చింది. భారతదేశ వ్యాప్త్తంగా పలు నగరాలకు చెందిన 25 మంది ఆభరణాల వర్తకులు మూడు రోజుల పాటు అంటే ఆగస్టు 7 నుంచి 9వ తేదీ వరకూ బంజారాహిల్స్‌ లోని తాజ్‌కృష్ణా హోటల్‌ గ్రాండ్‌ బాల్‌ రూమ్‌లో తమ డిజైన్లను ప్రదర్శించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ ఈ ప్రదర్శన జరుగనుంది.

అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలు అనుసరిస్తూ, కాంటాక్ట్‌లెస్‌, ఉచిత రిజిస్ట్రేషన్‌ను అందించడంతో పాటుగా మాస్కు ధారణ, శానిటైజేషన్‌, జ్వర పరీక్షలు వంటివి సందర్శకులతో పాటుగా ఎగ్జిబిటర్ల భద్రత కోసం చేశారు.

ఈ ఎక్స్‌పోలో అమృత్‌ సర్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గురుగ్రామ్‌, హైదరాబాద్‌, జైపూర్‌, ముంబైకు చెందిన 30 మంది జ్యువెలర్స్‌ తమ డిజైన్లను ప్రదర్శించనున్నారు.

జక్‌ జ్యువెల్స్‌ ఎక్స్‌పో 2021, 134వ ఎడిషన్‌ ప్రారంభం గురించి శ్రీ సయ్యద్‌ జకీర్‌ అహ్మద్‌, ఛైర్మన్‌, జక్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయంగా 30కు పైగా దేశాలలో వ్యాపారాలను అన్వేషించిన తరువాత, ఇంటికి తిరిగి రావడమంత ఆనందం మరేమీ కనిపించలేదు. కోవిడ్‌–19 కారణంగా గత సంవత్సరం వ్యాపారాలు చక్కగా జరుగలేదు. అయితే జనవరి 2021లో చెన్నై ; ఫిబ్రవరి 2021లో హైదరాబాద్‌ మరియు కోయంబత్తూరులలో నిర్వహించిన మా ఎడిషన్స్‌కు అపూర్వ ఆదరణ లభించింది. ఈ ఎక్స్‌పో ద్వారా పారదర్శకత, ఆధీకృత, వైవిధ్యత, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తూ మా కొనుగోలుదారులకు అసాధారణ అనుభవాలను అందించనున్నాం’’అని అన్నారు.

ఈ ప్రదర్శనలో అత్యంత సున్నితంగా తీర్చిదిద్దిన మాస్టర్‌ పీసెస్‌ మరియు ప్రకాశవంతమైన రీతిలో ఒక లక్షకు పైగా నూతన డిజైన్లను వజ్రాలు, రూబీలు, ఎమరాల్డ్స్‌, సఫైర్స్‌, పెరల్స్‌ మరియు ఇతర ప్రెసియస్‌,సెమీ ప్రెసియస్‌ స్టోన్స్‌తో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన బంగారం, ప్లాటినమ్‌, వెండి. జడౌ జ్యువెలరీ ని ప్రదర్శిస్తున్నారు. వీటితో పాటుగా మీనాకారి, కుందన్‌, జడౌ, సంప్రదాయ భారతీయ ఆభరణాలను సైతం ప్రదర్శిస్తున్నారు.

Related posts

ఓటింగ్ లో పాల్గొనాలి

Sub Editor

గిరిజన సంఘం రాష్ట్ర నూతన అధ్యక్ష ప్రధానకార్యదర్శులుగా ఎం. ధర్మనాయక్ ఆర్ శ్రీరాంనాయక్

Murali Krishna

పేకాడుతూ దొరికిపోయిన టీఆర్ఎస్ కార్పొరేటర్

Satyam NEWS

Leave a Comment