సినిమా హోమ్

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్

#KatrinaKaif

నెలల తరబడి కొనసాగిన ఊహాగానాలకు ముగింపు పలుకుతూ బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ దంపతులు తమ మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. 2021లో పెళ్లి చేసుకున్న ఈ జంట తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారా అని వారి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో వారు ఈ సంతోషకరమైన వార్తను పంచుచున్నారు.

దాంతో వారి అభిమానులు హృదయపూర్వకమైన సందేశాలతో అభినందనలు తెలుపుతున్నారు. మంగళవారం వారు పంచుకున్న పోలారాయిడ్ ఫోటోలో, కత్రినా తొలిసారి తన బేబీ బంప్‌ను చూపించగా, విక్కీ దానిని హత్తుకుని ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కిందికి చూసారు. ఆ ఫోటోకి జోడించి, వారు ఇలా రాశారు “మా జీవితంలోనే అందమైన అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాం.

హృదయపూర్వక ఆనందం, కృతజ్ఞతలతో ముందుకు సాగుతున్నాం” ఈ పోస్టు వెంటనే వైరల్ అవగా, అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షల వర్షం కురిపించారు. బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ కామెంట్ చేస్తూ, తన ఆనందం వ్యక్తం చేశారు. మరో నటి నేహా ధూపియా ఉత్సాహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు. ఈ వార్తతో సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నెలల తరబడి కొనసాగిన ఊహాగానాలకు తెరపడిందని అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

“మూడు ఏళ్లుగా జరుగుతున్న ఊహాగానాల తర్వాత, రెడిట్‌కి ఇప్పుడు శాంతి లభించింది!! వీరి విషయం చాలా సంతోషంగా ఉంది” అని రాశారు. మరో అభిమాని, “మినీ విక్కాట్ రాబోతుంది” అని పేర్కొన్నారు. కత్రినాకు ప్రత్యేక శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఒక అభిమాని ఆమె ప్రయాణాన్ని పొగడ్తలతో కొనియాడుతూ, “బాలీవుడ్ స్టార్‌గా, వ్యాపారిణిగా విజయం సాధించిన కేటీ, ఇప్పుడు మాతృత్వాన్ని కూడా అదిరేలా చాటుకోబోతోంది! ఆమెకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటున్నాను” అని రాశారు.

Related posts

రజనీ పవర్ అర్థమైందా రాజా….

Satyam News

అధికారుల అలసత్వం..కాలనీ ప్రజల ఆగ్రహం!

Satyam News

గణనాథుని సేవించే మహా పర్వదినం

Satyam News

Leave a Comment

error: Content is protected !!