జాతీయం హోమ్

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న స్వామీజీ

#DelhiPolice

పెట్టుకున్న పేరు స్వామీజీ…. చేసే వృత్తి అతి పవిత్రమైన అధ్యాపక వృత్తి… చేసేవన్నీ తప్పుడు పనులు. ఢిల్లీలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ లో జరిగిన ఘోరమిది. శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ లో డైరెక్టర్ గా ఉన్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ సారథి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తూ పోలీసులకు దొరికిపోయాడు.

ఢిల్లీ వసంత్‌కుంజ్ నార్త్ పోలీస్‌స్టేషన్‌లో ఆగస్టు 4న పీజీడీఎమ్ విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ గాడ్‌మ్యాన్ పై కేసు నమోదు చేశారు. విచారణలో 32మంది ఈడబ్ల్యూఎస్ స్కాలర్‌షిప్ విద్యార్థినులలో 17మంది ఆయన అసభ్య పదజాలం, అశ్లీల సందేశాలు పంపడం, శారీరక వేధింపులకు పాల్పడడం వంటి ఆరోపణలు చేశారు. కొంతమంది మహిళా అధ్యాపకులు కూడా ఇదే విధమైన ఫిర్యాదులు చేశారు.

ఈ కేసులో భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదై, 16మంది బాధితులు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాలు ఇచ్చారు. విచారణలో, ఇన్స్టిట్యూట్ బేస్‌మెంట్‌లో నకిలీ డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్ 39 UN 1″తో వోల్వో కారు స్వామి వాడుతున్నట్లు బయటపడింది. దీనిపై ఆగస్టు 25న మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అప్పటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి పరారీలోనే ఉన్నారు. ఇదిలా ఉండగా, స్వామి చైతన్యానంద సరస్వతితో ఎలాంటి సంబంధం లేదని శ్రీ శృంగేరి శారదా పీఠం స్పష్టంచేసింది. “స్వామిజీ (డాక్టర్) పార్థసారథి అలియాస్ చైతన్యానంద సరస్వతి పీఠం ప్రతిష్టకు విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ప్రవర్తించినందున పీఠంతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచుకున్నాం.

ఆయనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదులు కూడా అందించాం” అని శృంగేరి పీఠం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. అలాగే AICTE అనుమతితో నడుస్తున్న శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్-రిసెర్చ్ విద్యార్థుల సంక్షేమాన్ని కాపాడేందుకు గవర్నింగ్ కౌన్సిల్‌ చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేసింది. పోలీసులు ప్రస్తుతం నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో శోధన కొనసాగిస్తున్నారు.

విమానాశ్రయాల వద్ద కూడా కఠిన నిఘా పెట్టారు. “విద్యార్థినులు, అధ్యాపకులు, సిబ్బంది వాంగ్మూలాలను సేకరించి, మెసేజ్‌లు, కాల్ రికార్డులు వంటి డిజిటల్ ఆధారాలను కూడా సేకరించాం. ఎక్కువ మంది బాధితులు ఉన్న ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తున్నాం” అని పోలీసులు వెల్లడించారు. అయితే నిందితుడు ఇప్పటికీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూనే ఉన్నాడు.

Related posts

గాజాలో ఇజ్రాయెల్ చర్యలు యుద్ధ నేరాలే

Satyam News

ఫలక్‌నుమా వంతెన ప్రారంభానికి సిద్ధం

Satyam News

సంప్ర‌దాయం ఆధునిక‌త‌ల మేళ‌వింపుగా బతుకమ్మ వేడుక‌లు

Satyam News

Leave a Comment

error: Content is protected !!