విజయవాడలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. APTDC చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇంద్రకీలాద్రి పైకి భక్తుల రాకపోకలకు సౌలభ్యం కల్పించేందుకు 12 సీట్ల మినీ వాహనాలను అనుమతించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కోరినట్లు ఆయన తెలిపారు. అలాగే ఈనెల 24 నుంచి 28 వరకు, అలాగే 30 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని వివరించారు.
ప్రత్యేక బస్సుల టైమింగ్స్ ఇలా ఉన్నాయి:
ఉదయం 5:00 గంటలకు మియాపూర్
5:20 గంటలకు కేపీహెచ్‌బీ
5:30కి కూకట్‌పల్లి
5:50కి అమీర్‌పేట్
5:55కి బేగంపేట్
6:15కి దిల్‌సుఖ్‌నగర్
6:25కి ఎల్బీనగర్ నుంచి బస్సులు బయలుదేరుతాయి.
మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన నంబర్లు: 77298 30011, 77298 20011