ఆధ్యాత్మికం హోమ్

శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో వాసవి మాత

#VasaviMata

దసరా నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు వైభవంగా జరుగుతున్నాయి. మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిదేవిగా అలంకరించి ఆలయ అర్చకులు రమేష్ ఆచారి రవి చైతన్య ప్రద్యుమ్నలు విశేష పూజలు, లక్ష్మీ, హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి  నివేదన చేశారు. శుక్రవారం పూజా దాతలు మనసాని అశోక్ అండ్ సన్స్, ముత్యాల లక్ష్మయ్య అండ్ సన్స్, వేణుగోపాల్ దంపతులు పూజలు నిర్వహించారు. సాయంత్రం దేవాలయంలో కుంకుమార్చన భక్తీశ్రద్ధలతో మహిళలు పాల్గొని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మండల అధ్యక్షులు నాగరాజు పట్టణ అధ్యక్షులు బాదామి శ్రీనివాసులు వ్యవస్థాపకులు మనసాని నాగరాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

అమెరికాకు గట్టిగా బుద్ధి చెప్పనున్న భారత్

Satyam News

మద్యం మత్తులో కారు పైకి బైక్‌తో దూసుకెళ్లిన యువకుడు

Satyam News

శత్రువుకు కూడా సాయం చేసిన లోకేష్‌

Satyam News

Leave a Comment

error: Content is protected !!