సోషల్ మీడియా ను నియంత్రించడం సాధ్యమేనా? ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా పై ప్రభుత్వం కొత్త వ్యూహం రూపొందిస్తున్నది. సోషల్ మీడియా నియంత్రణకై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ లో సభ్యులుగా మంత్రులు అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి లు ఉంటారు. సోషల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై ఈ కమిటీ ఫోకస్ పెడుతుంది.
తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్‌పై కూడా ప్రభుత్వం నిఘా పెడుతుంది. ఈ కమిటీ అంతర్జాతీయ బెస్ట్ ప్రాక్టీసులపై అధ్యయనం చేస్తుంది. తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్, నేషనల్ సెక్యూరిటీ ముప్పులపై చర్యలకు సిఫారసులు చేస్తుంది. పౌర హక్కుల పరిరక్షణకు మంత్రుల కమిటీ సూచనలు ఇవ్వనున్నది. అవసరమైతే నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటు సిఫారసు చేసే అధికారం కూడా కమిటీకి ఉంటుంది. సిఫారసులను వీలైనంత త్వరలో ప్రభుత్వానికి మంత్రుల కమిటీ సమర్పించనుంది.