NV పౌండేషన్, చైర్మన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నక్క వేణుగోపాల్ యాదవ్ దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో నర్సాయిపల్లి దుర్గామాత కమీటీ సభ్యులు నెలకొల్పిన మంటపానికి విచ్చేసి,అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులతో నర్సాయిపల్లి గ్రామం అభివృద్ధి చెంది, ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలని ఆకాంక్షించారు. అలాగే తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ,భక్తులకు అన్న ప్రసాదాలను అందజేస్తున్న నర్సాయిపల్లి దుర్గామాత కమిటీ సభ్యులను అభినందించారు.
నర్సాయిపల్లి దుర్గ మాత కమిటి సభ్యులు, నక్క వేణుగోపాల్ యాదవ్ కి, శాలువాతో సన్మానించడం జరిగింది. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.