పశ్చిమగోదావరి హోమ్

బ్రిటీష్ పాలకుల కన్నా ఘోరం ఈ వైసీపీ నేతలు

#ChintamaneniPrabhakarMLA

దేశాన్నే దోచేసిన అనాటి బ్రిటీష్ పాలకుల కన్నా పెద్ద దోపిడి దారులు వైసీపీ నాయకులు అని, అందుకే ప్రజలు ఘోరంగా తిరస్కరించారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. రాబోయే రోజుల్లో వైసిపి పార్టీ మొత్తం చెల్లా చెదురవుతుంది అని ఆయన అన్నారు.

సత్యం అహింస వంటి శాంతియుత మార్గాలే బాపూజీ సూచించిన సన్మార్గం అని, అవే నేటి కూటమి ప్రభుత్వ విధానం అని తెలిపారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గాంధీ మహాత్ముని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

అనంతరం దుగ్గిరాలలోని స్థానిక మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆనాడు దేశ సంపదను దోచుకుంటూ ప్రజలను పీడించిన బ్రిటిష్ పాలకులను మహాత్మా గాంధీ సత్యం అహింస వంటి శాంతియుత మార్గాలతో దేశం నుంచి వెళ్లగొట్టారు అని తెలిపారు.

అదే విధంగా ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ నాయకులను ఏజెంట్లుగా పెట్టి రాష్ట్రంలో గ్రామ స్థాయి వరకు దొరికినంత దోచేసారని, ఇదేంటంటూ అక్రమాలను ప్రశ్నించిన నాయకులు ప్రజలపై సైతం తప్పుడు కేసులు బనాయించి వేధించారని అన్నారు.

అందువల్లనే ఆనాటి బ్రిటిష్ పాలకుల కన్నా పెద్ద దోపిడీదారులుగా పాలిస్తున్న వైసిపి పాలనను ప్రజలు ఘోరంగా తిప్పి కొట్టారని, అయితే ప్రజల నిర్ణయం చూసిన తర్వాత కూడా వైసిపి నాయకుల్లో ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. ఇదేవిధంగా ముందుకు కొనసాగితే త్వరలో వైసీపీ పార్టీ మొత్తం చల్లా చదరవుతుందని, ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ భూస్థాపితం అవుతుందని ప్రభాకర్ అన్నారు.

ప్రజలందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కక్షపూరిత వేధింపులకు పాల్పడకుండా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పాలన కొనసాగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారంగానే చర్యలు చేపడుతుందని, గాంధీ మహాత్ముడు చూపించిన విధానంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సత్యం అహింస, అవినీతి రహిత పాలన ప్రధాన ఎజెండాగా కూటమీ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.

Related posts

మళ్లీ అమెరికా వెళుతున్న కవిత

Satyam News

ఫ్రీ బస్‌ స్కీమ్ పై మహిళల స్పందన ఎలా ఉంది?

Satyam News

మల్కాజ్ గిరి  స్టేషన్ లో  8 ఎక్స్ ప్రెస్ లు నిలిపేలా చర్యలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!